Newdelhi, Oct 22: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) ను చంపేస్తాం అంటూ ఇటీవల బెదిరింపులు రావడం తీవ్ర కలకలం సృష్టించింది. బిష్ణోయ్ గ్యాంగ్ (Bishnoi Gang) తో ఉన్న గొడవకి ముగింపు పలకాలంటే తమకు రూ.5 కోట్లు ఇవ్వాలంటూ ఇటీవల ముంబయి ట్రాఫిక్ పోలీసుల వాట్సప్ నంబర్ కు ఒక మెసేజ్ వచ్చిన విషయం తెలిసిందే. ఆ మొత్తాన్ని చెల్లించకపోతే మాజీ ఎమ్మెల్యే సిద్ధిఖీ కంటే దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆగంతకుడు ఆ మెసేజీలో వార్నింగ్ ఇచ్చాడు. దీంతో అంతా షాక్ అయ్యారు. అయితే ఇప్పుడు అదే నెంబర్ నుంచి మరో మెసేజ్ వచ్చింది. సల్మాన్ ను బెదిరించి తప్పుచేశానని తాజాగా ఆ నిందితుడు తెలిపాడు. ఈ మేరకు ముంబై ట్రాఫిక్ పోలీసులకు మరో మెసేజ్ పెట్టాడు. సల్మాన్ కు బెదిరింపు మెసేజ్ పంపించి చాలా తప్పుచేశానని.. తనను క్షమించాలని ఆ మెసేజ్లో పేర్కొన్నట్లు ముంబై పోలీసులు తెలిపారు. ఈ మెసేజ్ లు ఝార్ఖండ్ నుంచి వచ్చినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ నిందితుడి కోసం గాలిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
మా బావగారు మీ బాబుగారు.. బాలకృష్ణ అన్‌స్టాపబుల్ 4 సీజన్ చంద్రబాబు నాయుడు ఎపిసోడ్ గ్లింప్స్ విడుదల
Man who threatened Salman Khan apologises, claims it was a mistake#SalmanKhan @dipeshtripathi0 https://t.co/WB6hb7imVp
— IndiaToday (@IndiaToday) October 21, 2024
ఆ హత్యతో మరోమారు..
దేశవ్యాప్తంగా గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పేరు మరోమారు పెద్దయెత్తున వినిపిస్తోంది. మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దిఖీ హత్య తర్వాత బిష్ణోయ్ పేరు మరింత మారుమోగిపోయింది. సిద్దిఖీని హత్య చేసింది తామేనని బిష్ణోయి గ్యాంగ్ ప్రకటించుకున్న తర్వాత మరింత చర్చనీయాంశమైంది. ఇప్పటికే ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.