Manipur CM N Biren Singh Resigns (Photo Credits: ANI)

Manipur, FEB 09: మణిపుర్‌ ముఖ్యమంత్రి బీరెన్‌ సింగ్‌ (Biren Singh) రాజీనామా చేశారు. గవర్నర్‌ అజయ్‌ కుమార్‌ భల్లాను (Ajay Kumar Bhalla) కలిసి తన రాజీనామా లేఖను సమర్పించారు. జాతుల మధ్య వైరంతో కొంతకాలంగా మణిపుర్‌ (Manipur News) అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కాంగ్రెస్‌ నేతృత్వంలోని విపక్షాలు ప్రభుత్వంపై అవిశ్వాసానికి సిద్ధమైనట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే బీరెన్‌ సింగ్‌ పదవి నుంచి వైదొలగడం గమనార్హం.

Nalgonda: టిఫిన్ తినేందుకు వెళ్తే.. రూ.23 లక్షలు చోరీ, నల్గొండ జిల్లా నార్కట్ పల్లి వద్ద ఘటన.. సీసీటీవీ ఆధారంగా దొంగ కోసం పోలీసుల గాలింపు  

ఆదివారం ఉదయం డిల్లీకి వెళ్లిన బీరెన్‌ సింగ్‌.. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాలతో సమావేశమయ్యారు. అనంతరం మణిపుర్‌ వెళ్లిపోయిన ఆయన.. సాయంత్రం గవర్నర్‌ను కలిసి రాజీనామా లేఖను అందించారు. ఈయన వెంట పలువురు బీజేపీ నాయకులు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ఇప్పటివరకు రాష్ట్రానికి సేవ చేయడం గౌరవంగా భావిస్తున్నానని బీరెన్‌ సింగ్‌ తన లేఖలో పేర్కొన్నారు.

Manipur CM N Biren Singh Resigns

 

జాతుల మధ్య వైరంతో దాదాపు రెండేళ్లుగా మణిపుర్‌ అట్టుడుకుతోంది. హింస కారణంగా ఇప్పటివరకు 250 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అంచనా. అయితే, అల్లర్లను అరికట్టడంలో బీరెన్‌ సింగ్‌ ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ విపక్షాలు సహా సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు ఎదురవుతున్నాయి. ఇదే సమయంలో హింసను ప్రేరేపించడం వెనక ముఖ్యమంత్రి బీరెన్‌ సింగ్‌ హస్తం ఉందనే ఆరోపణలు రావడం, వీటికి సంబంధించి ఆడియోలు ఇటీవల లీక్‌ అయ్యాయి. ఈ అంశాన్ని కుకీ సంబంధిత సంస్థ సుప్రీం కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. వీటికి సంబంధించి ఫోరెన్సిక్‌ నివేదిక అందించాలని ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది.