రెండు తెగల మధ్య ఘర్షణలతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌ (Manipur) రావణకాష్టంలా తయారైంది. బుధవారం ఓ మహిళా మంత్రి ఇంటికి నిప్పుపెట్టిన ఆందోళనకారులు.. తాజాగా కేంద్ర మంత్రి ఆర్కే రంజన్‌ సింగ్‌ (Union Minister RK Ranjan Singh) ఇంటిపై దాడిచేశారు . ఇంఫాల్‌లో కర్ఫూ (Curfew) విధించడానికి నిరసిస్తూ.. గురువారం రాత్రి కోంగ్బా ప్రాంతంలో ఉన్న మంత్రి నివాసాన్ని సుమారు 1200 మంది ఆందోళనకారులు చుట్టుముట్టారు. ఇంటిపై పెట్రో బాంబులు (Petrol bombs) విసిరారు. దీంతో ఇళ్లు కాలిపోయింది. అయితే ఆ సమయంలో మంత్రి ఇంట్లో లేరని పోలీసులు వెల్లడించారు.మంత్రి ఇంటిపై దాడి జరగడం ఇది రెండో సారి.

Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)