New Delhi, FEB 26: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను (Manish Sisodia Arrest) అరెస్ట్ చేశారు సీబీఐ అధికారులు. ఈ ఉదయం నుంచి ఆయన్ను విచారించిన సీబీఐ (CBI) అధికారులు...అనంతరం అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు. సిసోడియాను రేపు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు ఢిల్లీ పోలీసులు. సిసోడియా అరెస్ట్ (Manish Sisodia Arrested By CBI) నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపొందించడంలో సిసోడియా కీలకంగా వ్యవహరించారు. దాంతో ఆయన్ను సుధీర్ఘంగా విచారించింది సీబీఐ. ఢిల్లీకి చెందిన ఓ బ్యూరోక్రాట్ ఇచ్చిన సమాచారం మేరకు సిసోడియాను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఆయన విచారణకు సహకరించలేదని, అందుకే అరెస్ట్ చేసినట్లు అధికారులు చెప్తున్నారు.
Delhi | CBI arrests Delhi Deputy CM Manish Sisodia in connection with liquor policy case. pic.twitter.com/gFjHPV33ZG
— ANI (@ANI) February 26, 2023
అయితే సిసోడియా అరెస్ట్ పై ఉదయం నుంచి ఊహాగానాలు వస్తున్నాయి. పెద్ద ఎత్తున ఆప్ కార్యకర్తలు ఢిల్లీ వీధుల్లో ఆందోళనలు నిర్వహించారు. దాంతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. సిసోడియా అరెస్ట్ ను ఆప్ వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టేందుకే కేంద్రం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని మండిపడుతున్నారు ఆప్ నేతలు.