New Delhi, August 26: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ భద్రతా సిబ్బంది నుండి ప్రత్యేక భద్రతా బృందం SPG - Specail Protection Group) ను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. అయితే CRPF కేటగిరీలో "Z +" భద్రత ఆయనకు కొనసాగించనున్నట్లు క్యాబినెట్ సెక్రటేరియట్ మరియు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఎస్పీజి బృందంలో ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటిబిపి), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) మరియు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సిఐఎస్ఎఫ్) ల నుండి దాదాపు 3000 మంది సిబ్బంది భద్రతను పర్యవేక్షిస్తారు. ప్రధానమంత్రి, మాజీ ప్రధాన మంత్రులు, వారి కుటుంబ సభ్యులకు మరియు చాలా ఉన్నత స్థాయి రాజకీయ నాయకులకు ఈ ఎస్పీజీ భద్రత లభిస్తుంది. ఈ ప్రకారంగా ఇక నుంచి మన్మోహన్ సింగ్ కు కేవలం సీఆర్పీఎఫ్ భద్రత మాత్రమే లభించనుంది. సెక్యూరిటీ ఏజెన్సీల నివేదికల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కేంద్ర హోం శాఖ వెల్లడించింది.
ఇంతకు ముందు మాజీ ప్రధానులైన హెచ్‌డి దేవేగౌడ, విపి సింగ్‌లకు కూడా ఈ ఎస్పీజీ భద్రతను కేంద్రం కుదించిది. ప్రస్తుతం ఎస్పీజీ భద్రత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక జాతీయాధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మరియు ప్రియాంక గాంధీ తదితరులకు మాత్రమే ఎస్పీజీ భద్రత కొనసాగుతుంది.
అప్పట్లో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్య తర్వాత వారి కుటుంబానికి భద్రతను పెంచుతూ 1985 నుంచే ఈ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజి) ను అమలులోకి తీసుకొచ్చారు.
ప్రధాని పదవి నుంచి మన్మోహన్ సింగ్ దిగిపోయిన తర్వాత ఆయన కుమార్తెలు 2014 లోనే ఈ ఎస్పీజీ భద్రతను స్వచ్ఛందంగా ఉపసంహరించుకున్నారు. వదులుకున్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి యొక్క దత్త కుమార్తె కూడా స్వచ్ఛందంగా ఎస్పీజీ భద్రతను వదులుకుంది. దేశంలో చాలా మంది ప్రధానులకు, వారి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ఎస్పీజీ భద్రను కుదించుతూ వచ్చింది. ఒక్క వాజ్‌పేయికి మాత్రమే ఆయన చనిపోయేంతవరకు ఎస్పీజీ భద్రత కొనసాగింది.