Marcus Stoinis (Photo Credits: @ICC/X)

New Delhi, June 19:  టీ20 ప్రపంచకప్‌ కొనసాగుతుండగా.. ఐసీసీ తాజాగా టీ20 ర్యాకింగ్స్‌ను (ICC Rankings) బుధవారం విడుదల చేసింది. ఆఫ్ఘన్‌ ఆటగాడు మహ్మద్‌ నబీని (Nabi) అధిగమించి ఆస్ట్రేలియాకు చెందిన స్టోయినిస్‌ (Marcus Stoinis) నెంబర్‌ వన్‌ ఆల్‌ రౌండ్‌గా నిలిచాడు. ప్రస్తుత టీ20 వరల్డ్‌ కప్‌ ఎడిషన్‌లో స్టోయినిస్ ఆరు వికెట్లు తీయడమే కాకుండా బ్యాట్‌తోనూ రాణించాడు. నబీ మూడు స్థానాలు కోల్పోయి నాలుగో స్థానానికి చేరుకున్నాడు. శ్రీలంక కెప్టెన్‌ వనిందు హసరంగ రెండో స్థానంలో, బంగ్లాదేశ్ వెటరన్ షకీబ్ అల్ హసన్ మూడో స్థానంలో ఉన్నారు. జింబాబ్వే ఆల్‌ రౌండర్‌ సికందర్ రజా (Raza) ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు. 

Kane Williamson: టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024లో ఘోరపరాభవం, వన్డేల్లో, టీ20ల్లో కెప్టెన్సీకి గుడ్ బై చెప్పిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్  

టీమిండియా ఆల్‌ రౌండర్‌ హర్దిక్‌ పాండ్యా (Pandya) ఏడో స్థానంలో కొనసాగుతున్నాడు. మూడు మ్యాచ్‌ల్లో అద్భుతమైన బౌలింగ్‌తో పాండ్యా ఒక ర్యాంకును మెరుగుపరుచుకున్నాడు. టాప్‌-10 ఆల్‌రౌండర్లలో కేవలం టీమిండియా నుంచి కేవలం పాండ్యాకే చోటు దక్కింది. ఇక టీ20 బౌలర్స్‌ ర్యాంకింగ్‌ ఇంగ్లండ్‌కు చెందిన ఆదిల్‌ రషీద్‌ (Rashid) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. వెస్టిండిస్‌ లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ అఖిల్‌ హుస్సేన్‌ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఏకంగా ఆరుస్థానాలను మెరుగుపరుచుకొని రెండో స్థానానికి చేరాడు. శ్రీలంకకు చెందిన వనిందు హసరంగ మూడో స్థానంలో ఉండగా.. ఆఫ్ఘన్‌ బౌలర్‌ రషీద్‌ ఖాన్‌ నాలుగో స్థానంలోకి చేరాడు. 

36 Runs in an Over: యువరాజ్ తర్వాత మళ్లీ ఒకే ఓవర్‌లో 36 పరుగులు, ఆప్ఘన్ బౌలర్ అజ్మతుల్లాను ఊచకోత కోసిన వెస్టిండీస్ నికోలస్ పూరన్  

దక్షిణాఫ్రికా బౌలర్‌ అన్రిచ్ నోర్టేజే ఐదోస్థానం, ఆఫ్ఘన్‌ బౌలర్‌ ఫజల్హాక్ ఫారూఖీ ఆరోస్థానంలో కొనసాగుతున్నాడు. ఇక భారత స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌ () తొమ్మిదో స్థానంలో కొనసాగుతున్నాడు. టీ20 బ్యాట్స్‌మెన్‌లలో సూర్యకుమార్‌ యాదవ్‌ నెంబర్‌వన్‌ స్థానంలో ఉన్నారు. ఫిల్ సాల్ట్, బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు. ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ ఐదు స్థానాలు మెరుగుపరుచుకొని ఐదో ర్యాంక్‌కు చేరుకోగా, వెస్టిండీస్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ నికోలస్ పూరన్ 11వ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. వెస్టిండీస్‌కు చెందిన షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ 43 స్థానాలు ఎగబాకి 42వ స్థానంలో ఉన్నాడు.