Newdelhi, June 3: ఒడిశాలో (Odisha) జరిగిన రైలు దుర్ఘటనపై (Train Accident) రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో (Droupadi Murmu) పాటు ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi), కాంగ్రెస్ అగ్రనేతలు మల్లిఖార్జున ఖర్గే (Mallikarjun Kharge), రాహుల్ గాంధీ (Rahul Gandhi) సహా పలువురు నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.
- రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము: ఈ ఘటన దురదృష్టకరం క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలి. రైలు ప్రమాదంలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర వేదనకు గురి చేస్తున్నది.
- ప్రధాని మోదీ: ప్రమాద ఘటన కలచివేసింది. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నా. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నా. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేలు ఆర్థిక సాయం అందిస్తాం.
- ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్: రైలు ప్రమాదం దురదృష్టకరమైన ఘటన. ప్రమాద ఘటనపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నా. ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
- బెంగాల్ సీఎం మమతా బెనర్జీ: కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదానికి గురికావడం దిగ్భ్రాంతి కలిగించింది. మా రాష్ట్రానికి చెందిన వారి క్షేమం కోసం ఒడిశా ప్రభుత్వం, సౌత్ ఈస్ట్రన్ రైల్వేతో సమన్వయం చేస్తున్నా. ఇందుకోసం ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశాం. 033-22143526/22535185 నంబర్లను సంప్రదించాలి.
- తమిళనాడు సీఎం స్టాలిన్: షాక్‌కు గురయ్యా.. ఈ ఘటన నన్ను తీవ్ర ఆవేదనకు గురిచేసింది. వెంటనే ఒడిశా సీఎంతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నా. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి తన ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నా.
- కేంద్ర హోం మంత్రి అమిత్ షా: ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం ఇప్పటికే ప్రమాద స్థలానికి చేరుకుంది. ఇతర బృందాలు కూడా రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొంటున్నాయి. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా.
- మల్లికార్జున ఖర్గే: క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలి. కాంగ్రెస్ శ్రేణులు సహాయక చర్యల్లో పాల్గొనండి.
- రాహుల్ గాంధీ: క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహాయక చర్యల్లో పాల్గొనాలి.
- రాజ్‌నాథ్ సింగ్: ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర బాధను కలిగించింది. నా ఆలోచనలు బాధిత ప్రయాణికులు, వారికుటుంబాల చుట్టూనే ఉన్నాయి. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా.
- కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్: ఘోర రైలు ప్రమాదంలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారన్న విషయం తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యాను. సహాయక చర్యలు విజయవంతం కావాలని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను.
- నితిన్ గడ్కరీ: ఘోర రైలు ప్రమాదం గురించి విని చాలా బాధపడ్డాను. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. ఓం శాంతి.
- నిర్మలాసీతారామన్: రైలు ప్రమాద ఘటన చాలా బాధాకరం. రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రమాద స్థలానికి వెళ్తున్నారు. మృతుల ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా.
- తెలంగాణ సీఎం కేసీఆర్: ఈ ఘటన అత్యంత దురదృష్టకరం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలి. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకొని, వారికి భరోసా కల్పించాలి.