planet astrology

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాలు, నక్షత్రాల కదలిక కొన్ని రాశులవారికి శుభసూచకంగా..మరికొన్ని రాశులవారికి అశుభంగా ఉంటుంది. ఇక జూలై 13న ఆషాఢ పౌర్ణిమ వస్తుండటంతో ఏ రాశులపై ప్రభావం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఆషాఢ పౌర్ణిమ రోజున శుక్రగ్రహం.. ఉదయం 10 గంటల 41 నిమిషాలకు మిధునరాశిలో ప్రవేశించి..ఆగస్టు 7 వరకూ ఇదే రాశిలో కొనసాగనున్నాడు.

ఇప్పటికే జూలై 2న బుధ గ్రహం మిధునరాశిలో ప్రవేశమైన సంగతి విదితమే. జూలై 13న శుక్ర గ్రహం మిధునరాశిలో ప్రవేశిస్తూనే..బుధ, శుక్ర గ్రహాల కలయికతో (Mercury-Venus Conjunction) లక్ష్మీ నారాయణుల యోగం ఏర్పడుతుంది. ఈ క్రమంలో జూలై 13 నుంచి జూలై 16 వరకూ ఉన్న సమయం కొన్ని రాశుల వారికి (Zodiac Signs Will Have The Best Week) అపరిమిత లాభాల్ని చేకూరుస్తుంది.

సింహరాశి : జూలై 13వ తేదీన శుక్రగ్రహం గోచారం సందర్భంగా సింహరాశి వారికి అంతా శుభమే జరుగుతుంది. ఈ గోచారం కారణంగా ధనం బాగా సమకూరుతుంది. సేవింగ్స్ ఎక్కువగా చేయడం జరుగుతుంది. శుక్రగ్రహం గోచారం కారణంగా సింహరాశి జాతకులు విదేశీ యాత్ర చేయవచ్చు. పనిచేసే చోట లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు లభిస్తాయి.

మరో రెండు రోజుల్లో గురుపౌర్ణమి..మీ భవిష్యత్తు సంపదతో నిండిపోవాలంటే ఇలా చేయడం మరచిపోకండి, వ్యాస పౌర్ణమి అంటే ఏమిటో ఓ సారి తెలుసుకుందాం

తులారాశి :ఈ రాశిలో బుధుడు ముందు నుంచే ఆసీనుడై ఉన్నాడు. జూలై 13న బుధ-శుక్ర గ్రహాల కలయికతో యోగం ఏర్పడుతుంది. ఫలితంగా తులారాశివారికి అధిక ప్రయోజనం చేకూరనుంది. చేసే ప్రతిపని విజయవంతమౌతుంది. లక్ష్మీ నారాయణుని యోగం తుల రాశివారికి చాలా లాభదాయకం. కెరీర్‌పరంగా కొత్త అవకాశాలు లభిస్తాయి. కుటుంబం, పిల్లలతో ఆనందంగా ఉంటారు. ధనవంతులయ్యేందుకు ఇది అద్భుత అవకాశం.

కుంభరాశి: ఈ రాశి వారికి ఆషాఢ పౌర్ణిమ శుభ ప్రభావం చూపించనుంది. ఆర్ధికంగా ప్రయోజనం చేకూరుతుంది. వ్యాపారానికి సంబంధించిన వ్యక్తులకు శుభం కలగనుంది. మంచి లాభాలుంటాయి. ఒకవేళ ప్రాపర్టీలో పెట్టుబడులు పెట్టాలనుకుంటే..ఇదే మంచి సమయం. అటు వ్యాపారాలు ప్రారంభించేందుకు కూడా అనువైన సమయం.

వృశ్చిక రాశి: ఈ రాశి వారికి..బుధ, శుక్ర గ్రహాల కలయిక లాభదాయకంగా ఉంటుంది. ప్రత్యేకించి వ్యాపారవర్గాలకు మంచి సమయమని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ సందర్భంగా వృశ్చికరాశివారి జీవితంలో సుఖ సంతోషాలు లభిస్తాయి. కొత్త ఉద్యోగాలు వస్తాయి. లక్ష్మీ నారాయణుని యోగంతో లక్ష్మీ కటాక్షం దొరుకుతుంది. అకస్మాత్తుగా ధనలాభం కలుగుతుంది.