MiG-29K Fighter Aircraft Crash: టేకాఫ్ అయిన కొద్ది సేపటికే గోవాలో కూలీన భారత నావికాదళానికి చెందిన మిగ్- 29కే యుద్ధ విమానం, ఇద్దరు పైలట్లు సురక్షితం
MiG-29K Fighter Aircraft (Photo Credits: ANI)

Panaji, November 16: భారత నావికాదళానికి చెందిన మిగ్ -29 కె యుద్ధ విమానం (MiG-29K Fighter Aircraft)  గోవా (Goa)లో టేకాఫ్ తీసుకున్న వెంటనే కూలిపోయింది. అయితే ఈ ప్రమాదంలో పైలట్లు ఇద్దరూ సురక్షితంగా బయటపడినట్లు నావికాదళ వర్గాలు వెల్లడించాయి. పైలైట్లకు శిక్షణ ఇస్తున్న క్రమంలో ఈ యుద్ధ విమానం కూలినట్లు తెలుస్తుంది. కూలిపోయిన యుద్ధ విమానం శిక్షణ కోసమే ఉపయోగించే ఫైటర్ జెట్ ట్రైనర్ వెర్షన్ అని నివేదికల ద్వారా వెల్లడవుతుంది.

ఈ ట్రైనర్ వెర్షన్ విమానంలో పైలెట్లు టేకాఫ్ తీసుకోగానే దాని ఇంజిన్ లో మంటలు చెలరేగాయని నేవీ ప్రతినిధి కమాండర్ వివేక్ మాధ్వాల్ వెల్లడించారు. ప్రమాదాన్ని గుర్తించి పైలెట్లు ఇద్దరూ సేఫ్ గా విమానం నుంచి ఎజెక్ట్ (Safe Eject) అయ్యారని ఆయన తెలిపారు. ఆ ఇద్దరు పైలట్లు కెప్టెన్ ఎం. షీఖండ్, లెఫ్టినెంట్ కమాండర్ దీపక్ యాదవ్ గా నేవీ అధికారులు గుర్తించారు.

Here's Flash News Update:

 

. గత సెప్టెంబర్ నెలలో ఇండియన్ ఆర్మీకి చెందిన సింగిల్ సిలిండర్ సామర్థ్యం గల చిరుత హెలికాప్టర్ భూటాన్ లో కూలిపోయింది. ఈ ప్రమాదంలో భారతీయ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ ర్యాంకు గల పైలట్ ఒకరు మరియు భారత ఆర్మీ సహాకారంతో శిక్షణ పొందుతున్న భూటాన్ రాయల్ ఆర్మీకి చెందిన పైలట్ ఒకరు ప్రాణాలు కోల్పోయారు.

మిగ్ -29 ఫైటర్ జెట్లను అంతర్జాతీయంగా తొలిసారిగా సొంతం చేసుకున్న దేశం భారతే.  1980 లో భారత వైమానిక దళం (IAF) 66 కు పైగా మిగ్ -29 ఫైటర్ జెట్ల ఆర్డర్ ఇచ్చింది. అప్పట్నించి ఇండియన్ ఆర్మీ సూచనల మేరకు కొత్త ఏవియానిక్స్, సబ్ సిస్టమ్స్, టర్బోఫాన్ ఇంజన్లు మరియు రాడార్లతో పాటు ఇలా అనేక మార్పులు చేసుకుంటూ వస్తుంది.