
Bhopal November 12: మధ్యప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే తనయుడు బాత్రూమ్‌లో అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించాడు. రివాల్వర్‌తో కాల్చుకొని అతని సూసైడ్ చేసుకొని ఉంటాడని భావిస్తున్నారు.
ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకున్నది. బర్గి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్ యాదవ్ హతితాల్ గోరఖ్‌పూర్‌లో నివాసం ఉంటున్నారు. ఆయన తనయుడు 17 ఏళ్ల వైభవ్ యాదవ్ గురువారం సాయంత్రం సమయంలో ఇంట్లోని బాత్‌రూమ్‌లో రివాల్వర్‌తో తలపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీస్ అధికారి అలోక్ శర్మ తెలిపారు. బుల్లెట్ శబ్ధం విని కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకొని.. గాయంతో ఉన్న అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించగా, అక్కడ మృతి చెందాడు.
అయితే, ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఆత్మహత్యకు యువకుడు వినియోగించిన ఆయుధం ఇంకా లభ్యం కాలేదని అదనపు సూపరింటెండెంట్ రోహిత్ కేశ్వాని చెప్పారు. పోలీసులు గన్ కోసం వెతుకుతున్నారని, రికవరీ తర్వాత మాత్రమే ఆయుధం లైన్స్ ఉందా? లేదా? తెలుస్తుందన్నారు. ఎమ్మెల్యే తనయుడి ఆత్మహత్య గురించి సమాచారం అందుకున్న ఆ పార్టీకి చెందిన నేతలంతా ఆసుప్రతి వద్దకు చేరుకొని, ఎమ్మెల్యేను ఓదార్చి, సంతాపం తెలిపారు.