
Bhopal, July 05: వైరల్ వీడియోలో గిరిజనుడిపై మూత్ర విసర్జన చేసిన నిందితుడు ప్రవేశ్ శుక్లాను మధ్యప్రదేశ్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. నిందితుడు ప్రవేశ్ శుక్లాను (Pravesh Shukla) విచారిస్తున్నామని, త్వరలోనే అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిద్ధి అదనపు పోలీసు సూపరింటెండెంట్ అంజులత పాట్లే చెప్పారు. (urination case) నిందితుడిపై భారతీయ శిక్షాస్మృతి, ఎస్సీ,ఎస్టీ చట్టంలోని సెక్షన్ 294, 504 కింద కేసు నమోదు చేశారు. గిరిజన యువకుడిపై మూత్రం పోసిన ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని ఆదేశించినట్లు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. (MP Police takes custody of accused) రాష్ట్ర ప్రభుత్వం నిందితుడిని వదిలిపెట్టదని, అతడిని శిక్షించడం అందరికీ గుణపాఠం అని సీఎం చౌహాన్ అన్నారు.
प्रवेश शुक्ला गिरफ्तार.
पुलिस उचित सेवा करे.pic.twitter.com/kCEDFkfvua
— Ranvijay Singh (@ranvijaylive) July 5, 2023
జిల్లాలోని కుబ్రి గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. నిందితుడు మద్యం తాగి గిరిజనుడి ముఖంపై మూత్ర విసర్జన చేసినట్లు సమాచారం. నిందితుడు ప్రవేశ్ శుక్లా కుబ్రి గ్రామానికి చెందినవాడు. జిల్లాలోని కరౌండి గ్రామానికి చెందిన దస్మత్ రావత్ (36) అనే వ్యక్తి బాధితుడు. ఈ ఘటన సిగ్గు చేటు అని, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా చెప్పారు.