
Bhopal, JAN 14: ఇప్పటి వరకు మనం ఆదాయపు పన్ను, నీటి పన్ను, ఇంటి పన్ను వంటివి మాత్రమే చూసుంటాం. అయితే, మధ్యప్రదేశ్‌లో మాత్రం అధికారులు కొత్త పన్నును (tax) ప్రజలకు పరిచయం చేశారు. ఇకపై ఎవరైనా కుక్కలను పెంచుకుంటే ట్యాక్స్ విధించనున్నారు. మధ్యప్రదేశ్‌లోని సాగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 48 మంది కౌన్సిలర్లు దీన్ని ఏకగీవ్రంగా ఆమోదించారు. త్వరలోనే న్యాయ నిపుణులతో చర్చించి దీనిపై విధివిధానాలను రూపొందించనున్నారు. ఈ మేరకు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వివరాలు వెల్లడించారు. ప్రజల భద్రత, పరిశుభ్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
ఏడాది ఏప్రిల్ నుంచి దీన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. నగరంలో కుక్కల దాడి ఘటనలు పెరుగుతున్నాయని, బహిరంగ ప్రదేశాల్లోకి పెంపుడు శునకాలను (Dogs) తీసుకొచ్చి మలమూత్ర విసర్జన (cleanliness) చేయించడం వల్ల పరిసరాలు అపరిశుభ్రం అవుతున్నాయని చెప్పారు. వీటిని అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడించారు. శునకాలకు రిజిస్ట్రేషన్, వ్యాక్సినేషన్, కుక్కలను పెంచుకునేవారికి పన్నులు విధిస్తామని వారు స్పష్టం చేశారు.