Bhopal, April 1: మధ్యప్రదేశ్‌లోని బెతుల్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ట్యూషన్‌కు వచ్చే బాలిక(15)పై కన్నేసిన ఓ కామాంధుడైన టీచర్ ఆమెపై లైంగిక దాడికి (Minor Girl Raped) పాల్పడటంతో బాధితురాలు గర్భం దాల్చింది. అనంతరం నిందితుడి తల్లితండ్రులతో కుమ్మక్కై ఆమెకు బలవంతంగా ప్రైవేట్ ఆస్పత్రిలోని డాక్టర్ అబార్షన్ (Forced to Undergo Abortion) చేయడం కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కోచింగ్ సెంటర్‌ను నిర్వహించే ప్రకాష్ భోజ్‌కర్ గత ఏడాది అక్టోబర్ 16న బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
ఈ విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని నిందితుడు బాధితురాలిని హెచ్చరించాడు. బాలిక గర్భం దాల్చిందని తెలియడంతో నిందితుడి తల్లితండ్రులు పట్టణంలోని కరుణా ఆస్పత్రికి ఆమెను తీసుకువచ్చి మార్చి 22న అబార్షన్ చేయించారు. ఈ విషయం వెలుగుచూడటంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిందితుడితో పాటు అతడి తల్లితండ్రులు, అబార్షన్ చేసిన వైద్యురాలిని పోలీసులు అరెస్ట్ (Doctor, Accused Among 4 Held) చేశారు.
ఇక మహారాష్ట్రలో తనతో కలిసి ఉండేందుకు నిరాకరించిందనే కోపంతో మహిళ (23) పేరుతో నకిలీ వివాహ ప్రకటన ఇచ్చిన వ్యక్తి (37)ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన మహారాష్ట్రలోని పుణే గోర్పాడి ప్రాంతంలో వెలుగుచూసింది. మహిళ ప్రతిష్టను దిగజార్చాలనే ఉద్దేశంతో నిందితుడు ఆమె పేరిట సోషల్ మీడియాలో నకిలీ పెండ్లి ప్రకటన పోస్ట్ చేశాడు. నిందితుడు, బాధితురాలు ఒకరికి మరొకరు పరిచయస్తులని పోలీసులు తెలిపారు.
వివాహితుడైన నిందితుడు తరచూ యువతి వెంటపడుతూ తనతో కలిసి ఉండాలని ఒత్తిడి తెచ్చేవాడు. దీనికి నిరాకరించిన యువతి తాను మరో వ్యక్తిని వివాహం చేసుకోవాలని కోరుకుంటున్నానని చెప్పింది. తన ప్రతిపాదనను యువతి తోసిపుచ్చడంతో ఆమె పేరుతో సోషల్ మీడియాలో నకిలీ వివాహ ప్రకటన పోస్ట్ చేశాడు. యువతి విడాకులు తీసుకుందని, ఆమె 45 ఏండ్లు పైబడిన వ్యక్తిని పెండ్లి చేసుకోవాలని అనుకుంటోందని ఆ యాడ్‌లో పేర్కొన్నాడు. యువతి బంధువులు, ఇతరులు ఈ ప్రొఫైల్‌ను చూసి ఆమెను ప్రశ్నించడంతో నిందితుడిని నిలదీయడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేసింది.