Polavaram Project- Approach Channel | Photo: twitter video grab

New Delhi December 02: ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh) ప్రభుత్వానికి భారీ షాక్ తగిలింది. పర్యావరణ అనుమతులు(Environment Clearance) ఉల్లంఘించారంటూ ఏపీ సర్కారుకు భారీ ఫైన్(Fine) వేసింది నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్(NGT). పోలవరం ప్రాజెక్టు(Polavaram Project)లో పర్యావరణ అనుమతులు ఉల్లంఘించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి రూ.120కోట్ల జరిమానా విధించింది.

పర్యావరణ అనుమతులు లేకుండా కట్టిన మరో 3 ప్రాజెక్టులకు కూడా జరిమానా విధించింది. పురుషోత్తపట్నం ప్రాజెక్టు(Purushottamapatnam Project)కు సంబంధించి రూ.24.56 కోట్లు, పట్టిసీమ ప్రాజెక్టు(Patti Seema Project)కు సంబంధించి రూ.24.90 కోట్లు, చింతలపూడి ప్రాజెక్టు(Chinthalapudi Project)కు సంబంధించి రూ.73.6 కోట్లు జరిమానా విధించింది. జరిమానాను 3 నెలల్లో చెల్లించాలని రాష్ట్రానికి ఎన్జీటీ ఆదేశించింది. ఏపీ కాలుష్య నియంత్రణ మండలి(AP Pollution Board)కి జరిమానా చెల్లించాలని ఆదేశాల్లో పేర్కొంది.

జరిమానా నిధుల వినియోగంపై  ఏపీ పీసీబీ, సీపీసీబీ సభ్యులతో కమిటీ నియమించాలని ఆదేశించింది. పర్యావరణ అనుమతల ఉల్లంఘనలపై గతంలో ఎన్జీటీ(NGT)కి ఫిర్యాదులు అందాయి. పెంటపాటి పుల్లారావు, వట్టి వసంతకుమార్‌ ఎన్జీటీకి ఫిర్యాదులు చేశారు. దీనిపై విచారించిన  ఎన్జీటీ భారీగా జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది.