New Delhi January 08:  ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్(Assembly elections in five States ) వచ్చేసింది. కరోనా తీవ్రత పెరుగుతుండటంతో ర్యాలీలు(rallies), రోడ్ షోలు(Road Shows), బహిరంగ సభలు(Public meeting), పాదయాత్ర(Padayatra)లపై నిషేదం విధించింది. బహిరంగ సభలు, వెహికిల్ ర్యాలీలు, పాదయాత్రలు, రోడ్ షోలపై జనవరి 15 వరకు నిషేదం విధించింది. ఈ తర్వాత పరిస్థితిని రివ్యూ చేసి నిర్ణయం తీసుకోనున్నారు. ప్రజలు, నేతలు కరోనా నిబంధనలను( COVID appropriate behaviour) కఠినంగా పాటిస్తూ ఎన్నికల కార్యక్రమాలను నిర్వహించాలని సూచించింది ఎన్నికల సంఘం.

రాజకీయ పార్టీలు డిజిటల్ ప్రచారాని(Digital campaigning)కే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. జనం గుమికూడకుండా, డిజిటల్ పద్దతిలో ప్రచారంపై పార్టీలు దృష్టి సారించాలన్నారు. ఇక రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు ప్రచారాలపై పూర్తి నిషేదం విధించారు. అంతేకాదు గరిష్టంగా ఐదుగురితోనే ఇంటింటి ప్రచారం చేసుకోవాలని సూచించారు. ప్రచారంలో కోవిడ్ నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడేవారిపై ఐపీసీతో పాటు డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందిని ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించనున్నట్లు చెప్పారు సీఈసీ సుశీల్ చంద్ర. అర్హత కలిగిన ఎన్నికల సిబ్బందికి ప్రికాషనరీ డోసులు ఇస్తామన్నారు. ఇప్పటికే ఐదు రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోందన్నారు. కోవిడ్ దృష్ట్యా ఈ సారి ఆన్లైన్ నామినేషన్లకు అవకాశం కల్పించారు. ఇక ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల వ్యయాన్ని రూ.40లక్షలకు పెంచుతున్నట్లు సీఈసీ తెలిపారు.

క్రిమినల్ కేసులు ఉన్న అభ్యర్థుల వివరాలను రాజకీయ పార్టీలు తమ వెబ్సైట్ల హోం పేజీల్లో ప్రచురించాలి. ఆ అభ్యర్థులను ఎందుకు ఎన్నుకున్నారో కారణాలు కూడా చెప్పాలని తెలిపారు. ఐదు రాష్ట్రాల్లోని మొత్తం 690 శాసనసభ నియోజకవర్గాలకు మొత్తం 7 దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు విడతల్లో పోలింగ్ జరుగనుంది. మార్చి 10న ఐదు రాష్ట్రాల కౌంటింగ్ జరుగనుంది.