New Delhi, May 21: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు (Manish Sisodia) గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కుంభకోణంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED), సీబీఐ దర్యాప్తు చేస్తున్న కేసుల్లో తనకు బెయిల్ (Bail) ఇవ్వాలని మనీశ్ సిసోడియా పెట్టుకున్న పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు మంగళవారం తిరస్కరించింది. మద్యం కుంభకోణం కేసులో మనీశ్ సిసోడియా కీలక సాక్ష్యాధారాలను ధ్వంసం చేశాడని హైకోర్టు వ్యాఖ్యానించింది.
Delhi: "The court has rejected the bail plea of Manish Sisodia. We respect the High Court, but we respectfully disagree with its decision," says AAP leader Atishi Marlena pic.twitter.com/0WZHlXt0IU
— IANS (@ians_india) May 21, 2024
అంతకు ముందు దిగువ న్యాయస్థానం మనీశ్ సిసోడియా జ్యుడీషియల్ రిమాండ్ ను ఈ నెలాఖరు వరకూ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.