Haryana November 10:  దుండగుల కాల్పుల్లో తాను మరణిచినట్లు వచ్చిన వార్తలు అవాస్తమని ప్రకటించారు రెజ్లర్‌ నిషా దహియా. తాను ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని గోండాకు వచ్చానని, ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నానని తెలిపారు. తనపై హత్యాయత్నం జరిగిందని వచ్చిన వార్తల నేపథ్యంలో మరో రెజ్లర్ సాక్షి మాలిక్‌తో పాటూ ఆమె ట్విట్టర్‌లో వీడియో విడుదల చేశారు.

హరియాణా సోనిపట్‌లోని హలాల్‌ గ్రామంలో సుశీల్‌ కుమార్‌ రెజ్లింగ్‌ అకాడమీ వద్ద నిషా దహియాపై కాల్పులు జరిగినట్లు జాతీయ మీడియాలో తొలుత వార్తలు వచ్చాయి. ఈ ఘటనలో ఆమెతో పాటు ఆమె సోదరుడు కూడా మరణించారని, ఆమె తల్లి కూడా గాయపడ్డారని ప్రచారం జరిగింది. అయితే ఈ అంశంపై కాసేపటికే రెజ్లర్‌ నిషా క్లారిటీ ఇచ్చారు.

నిజానికి నిషా అనే మహిళా రెజ్లర్‌పై ఇద్దరు దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నిషాతో పాటూ, ఆమె సోదరుడు మృతి చెందాడు. దీంతో నిషా దహియా మరణించిందని వార్తలు వచ్చాయి. కొద్ది సేపటికే నిషా బయటకు వచ్చిన వీడియో రిలీజ్ చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.