Odisha Train Tragedy (Photo Credits: Twitter/@ANI)

Balasore, June 07: ఒడిశా రైలు ప్రమాదం (Odisha Train Accident) మిగిల్చిన విషాదం వర్ణనాతీతం! రెప్పపాటులో జరిగిన ఈ దుర్ఘటన ఎంతోమంది కుటుంబాలను చీకట్లోకి నెట్టింది. 288 మంది ప్రాణాలను బలితీసుకుంది. ఒక్క ప్రమాదంలోనే ఇంతమంది మరణించడం విషాదమైతే.. వీరిలో చాలామంది ఆచూకీ ఇంకా లభ్యం కావడం లేదు. దీంతో వారిని గుర్తుపట్టాలని మృతదేహాల ఫొటోలను తీసి వెబ్‌సైట్‌లో ఉంచారు. దీన్ని అనుకూలంగా మార్చుకున్న దురాశపరులు కొత్త నాటకానికి (Fakes Husbands Death) తెర లేపుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన పరిహారం (Ex Gratia) కొట్టేసేందుకు చనిపోయింది తమ వాళ్లేనంటూ నకిలీ డాక్యుమెంట్లతో శవాలను తీసుకెళ్లిపోతున్నారు. తాజాగా ఈ మోసాన్ని గుర్తించిన ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంది.

Balasore Triple Train Crash: బాలాసోర్‌ ఘటనపై సీబీఐ దర్యాప్తు షురూ, ఐపీసీలోని వివిధ సెక్షన్‌ల ప్రకారం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన సీబీఐ అధికారుల బృందం 

ఒడిశా కటక్‌ సమీపంలోని మనియబంధ గ్రామానికి చెందిన గీతాంజలి గుప్తా (35) తన భర్త బిజయ్‌ దత్తా (40) కనిపించడం లేదని బహనగకు వచ్చింది. ప్రమాదం జరిగిన రోజు తన భర్త కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించాడని, అప్పట్నుంచి తన ఆచూకీ తెలియట్లేదని పోలీసులకు చెప్పుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ప్రమాద బాధితులను తరలించిన ఆస్పత్రులకు కూడా వెళ్లానని అయినా లాభం లేకుండా పోయిందని ఏడ్చేసింది. దీంతో పోలీసులు ఆమెను ఒడిశా ప్రమాద మృతదేహాలు ఉంచిన ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడున్న ఫొటోలను చూసుకోవాలని సూచించారు. కొన్ని ఫొటోలు చూసిన తర్వాత ఓ వ్యక్తి ఫొటో చూపిస్తూ అతనే తన భర్త అని చెప్పింది.

Sealdah-Ajmer Express Catches Fire: ఒడిశా ఘటన మరువక ముందే మరో రైలులో మంటలు, సీల్దా-అజ్మీర్ ఎక్స్‌ప్రెస్ రైలులో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు 

డెడ్‌ బాడీని తీసుకెళ్లేందుకు గీతాంజలి ఆధార్‌ కార్డ్‌ను అందజేసింది. అయితే అందులో గీతాంజలి వయస్సు 60 ఏండ్లుగా ఉంది. కానీ ఆమె అంత వయస్సు ఉన్నట్లుగా కనిపించలేదు. పైగా ఆమె ప్రవర్తన కూడా పోలీసులకు అనుమానాస్పదంగా కనిపించింది. దీంతో ఆధార్‌ కార్డ్‌ ఆధారంగా స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో విచారించారు. అప్పుడు గీతాంజలి భర్త బిజయ్‌ బతికే ఉన్నాడని తెలిసింది. అంతేకాదు అతను కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించలేదని వెల్లడైంది. దీంతో ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. మృతుల కుటుంబాలకు ఇచ్చే రూ.10 లక్షల పరిహారం కోసమే ఇలా నకిలీ పత్రాలతో వచ్చానని ఒప్పుకుంది. ఈ విషయాన్ని పోలీసులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇలాంటి మోసాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.