Coronavirus | Representational Image | (Photo Credits: Pixabay)

New Delhi December 05: భారత్‌లో మరో ఒమిక్రాన్(Omicron) కేసు నమోదైంది. ఈ సారి ఢిల్లీ(Delhi)కి చెందిన వ్యక్తికి ఒమిక్రాన్(Omicron)  నిర్ధారణ అయింది. దీంతో భారత్‌(India)లో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య ఐదుకు చేరింది. ఢిల్లీ (Delhi)లో ఒమిక్రాన్(Omicron)  సోకిన వ్యక్తి కూడా ఆఫ్రికా(Africa) దేశాల నుంచి వచ్చిన వ్యక్తే. ఇటీవల టాంజానియా(Tanzania) నుంచి ఢిల్లీకి వచ్చిన వ్యక్తికి కరోనా(Corona) పాజిటివ్ రావడంతో…అతని శాంపిల్స్ ను జీనోమ్ సీక్వెన్సింగ్‌ కోసం పంపించారు. ఈ టెస్టుల్లో అతనికి ఒమిక్రాన్ వేరియంట్ సోకినట్లు గుర్తించారు. దీంతో అతన్ని ఎల్‌ఎన్‌జేపీ(LNJP) ఆస్పత్రిలో చేర్పించారు. ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్నారు.

Covid-19: దేశంలో మరోసారి పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య, భారీగా పెరిగిన మరణాల సంఖ్య, కేరళలో అత్యధికంగా పాజిటివ్ కేసులు, తెలుగు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య ఇదే..

ఇప్పటి వరకు 17 మంది కరోనా పాజిటివ్‌ పేషెంట్లు ఎల్‌ఎన్‌జేపీ(LNJP) ఆస్పత్రిలో కరోనాతో చికిత్స పొందుతున్నట్లు ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్(Satyendra Jain) తెలిపారు.

ఇప్పటికే భారత్‌లో కర్ణాటక(Karnataka)కు చెందిన ఇద్దరు వ్యక్తుల, గుజరాత్(Gujarat), మహారాష్ట్ర(Maharastra)కు చెందిన ఒక్కో వ్యక్తికి ఒమిక్రాన్ వేరియంట్ గుర్తించారు. అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్(RT-PCR) టెస్టులు తప్పనిసరి చేశారు. ఆఫ్రికా దేశాల నుంచి వచ్చిన వారికి క్వారంటైన్ తప్పనిసరి చేశారు. అటు ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. కానీ అంత డేంజరస్ కాదని నిపుణులు చెప్తున్నారు. అయినప్పటికీ రెండు డోసుల వ్యాక్సిన్(Vaccine), కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఉంటే వైరస్ నుంచి తప్పించుకోవచ్చని సూచిస్తున్నారు.