Coronavirus (Photo Credits IANS)

Thane, November 29: మహారాష్ట్రలో ఒమిక్రాన్ వైరస్ అలజడి రేగింది. దక్షిణాఫ్రికా నుండి థానేకి తిరిగి వచ్చిన 32 ఏళ్ల ఇంజనీర్‌కి చేసిన కోవిడ్‌ పరీక్షల్లో కరోనా పాజిటివ్‌ (Maharashtra COVID-19 Patient) వచ్చింది. దీంతో అధికారులు కొత్త వైరస్‌ వేరియంట్‌ (Omicron Concern) దృష్ట్య కోవిడ్‌-19 ఐసోలేషన్‌ సెంటర్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే సదరు వ్యక్తిని ప్రభుత్వ ప్రోటోకాల్ ప్రకారం పరీక్షలు నిర్వహించడంతో అతను కరోనా బారిన పడినట్లు గుర్తించామని కళ్యాణ్ డోంబివిలి మున్సిపల్ కార్పొరేషన్ (కేడీఎంసీ) అంటువ్యాధి నియంత్రణ అధికారి డాక్టర్ ప్రతిభా పాన్‌ పాటిల్ తెలిపారు. పైగా ఏడు రోజుల తర్వాతే ఫలితాలు తెలుస్తాయని అన్నారు.

అయితే ఆ ఇంజనీర్‌ కాస్త తీవ్ర ఆందోళనకు గురవ్వడంతో కౌన్సిలింగ్‌ ఇస్తున్నట్లు పాటిల్‌ వెల్లడించారు. కేడీఎంసీ కమీషనర్ డాక్టర్ విజయ్ సూర్యవంశీ కళ్యాణ్ డోంబివిలి టౌన్‌షిప్ పౌరులను ఈ కొత్త వేరియంట్‌ దృష్ట్యా ఎటువంటి ఆందోళనలకు గురికావద్దని అన్నారు. పైగా కోవిడ్‌ ప్రోటోకాల్‌ని కచ్చితంగా పాటించాలంటూ పౌరులకు విజ్ఞప్తి చేశారు.

తెలంగాణలో కరోనా అలజడి, గురుకులంలో 43 మందికి పాజిటివ్, దక్షిణాఫ్రికా నుంచి హైదరాబాద్‌కు గత మూడు రోజుల్లో 185 మంది ప్రయాణికులు, ఇందులో 11 మందికి కరోనా పాజిటివ్‌

ఈ మేరకు అతని కుటుంబ సభ్యులు ఎనిమిది మందికి కూడా కోవిడ్‌ పరీక్షలు నిర్వహించడమే కాక ఆ ఇంజనీర్‌తో ప్రయాణించిన వారి గురించి కూడా విచారిస్తున్నాం అని అధికారులు అన్నారు. అయితే కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ వల్ల ప్రపంచానికి పెను ముప్పు వాటిల్లనుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) హెచ్చరించిన సంగతి తెలిసిందే.

మహారాష్ట్రలోని వృద్ధాశ్రమంలో 62 మందికి కరోనా సోకింది. దీంతో ఆ ప్రాంతాన్ని కంటైన్‌మెంట్ జోన్‌గా అధికారులు ప్రకటించారు. థానే జిల్లా భివాండి మండలం సోర్గావ్ గ్రామంలోని ‘మాతోశ్రీ’ వృద్ధాశ్రమంలో 62 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. 55 మంది వృద్ధులు, ఐదుగురు ఉద్యోగులు, సిబ్బందికి చెందిన ఏడాదిన్నర పాపతోసహా ఇద్దరు కుటుంబ సభ్యులకు కరోనా సోకినట్లు అధికారులు తెలిపారు. వారందరినీ థానే ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్‌ చేసినట్లు చెప్పారు.

ఒమిక్రాన్ వైరస్ లక్షణాలు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒమిక్రాన్ కరోనా వేరియంట్ పై ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రపంచదేశాలు, మళ్లీ మాస్కులు ధరించాలని సూచన

కాగా, వైరస్ బారిన పడినవారి ఆరోగ్యం నిలకడగానే ఉన్నదని వైద్యులు తెలిపారు. నలుగురు మాత్రం ఐసీయూ వార్డులో ఆక్సిజన్‌ వ్యవస్థపై చికిత్స పొందుతున్నారని చెప్పారు. 15 నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపినట్లు వెల్లడించారు. కరోనా సోకిన 62 మందిలో 55 మంది వృద్ధులు టీకా రెండు డోసులు తీసుకున్నట్లు వివరించారు. 62 మందిలో 37 మంది పురుషులు, 25 మంది మహిళలని చెప్పారు. వీరిలో 41 మంది వృద్ధులకు ఇతర అనారోగ్య సమస్యలున్నాయన్నారు. వృద్ధాశ్రమానికి చెందిన మరో ఐదుగురు అనుమానిత రోగులను కూడా ఆసుపత్రి జనరల్ వార్డులో చేర్చినట్లు వైద్యులు తెలిపారు.