omicron

New Delhi, January 23: దేశంలో ఒమిక్రాన్(Omicron) వేరియంట్ సామూహిక వ్యాప్తి ద‌శ‌( Community Transmission )లో ఉన్న‌ద‌ని ది ఇండియ‌న్ సార్స్ కోవ్‌-2 జీనోమిక్స్ క‌న్సార్టియం (INSACOG) తెలిపింది. అదేవిధంగా ఇప్ప‌టికే దేశంలో చాలా మెట్రో న‌గ‌రాల్లో ఇత‌ర వేరియంట్ల‌తో పోల్చితే ఒమిక్రాన్ వేరియంటే డామినేష‌న్ స్థాయికి చేరింద‌ని ఇన్సాకాగ్ వెల్ల‌డించింది. అందుకే ఆయా మెట్రో న‌గ‌రాల్లో క‌రోనా కేసుల సంఖ్య శ‌ర‌వేగంగా పెరుగుతున్న‌ద‌ని తాజా బులెటిన్‌లో స్ప‌ష్టం చేసింది.

ది ఇన్సాకాగ్ (INSACOG)త‌న తాజా బులెటిన్ అయిన‌ జ‌న‌వ‌రి 10 బులెటిన్‌ను ఆదివారం విడుద‌ల చేసింది. దేశంలో గ‌త డిసెంబ‌ర్‌లో ఒమిక్రాన్ వేరియంట్ (Omicron variant) వెలుగుచూసిన‌ప్ప‌టి నుంచి ఆ వేరియంట్ సోకిన‌వాళ్ల‌లో ఎలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డంలేదు. కొంద‌రిలో స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు క‌నిపించాయి. ప్ర‌స్తుతం థ‌ర్డ్‌వేవ్‌ (Third wave)లో కేసులు పెరిగి ఆస్ప‌త్రుల్లో చేరేవాళ్లు, ఐసీయూ కేసులు(ICU Cases) ఎక్కువైనా ఒమిక్రాన్‌తో ప్ర‌మాద‌స్థాయిలో మాత్రం ఏమాత్రం తేడా లేదు.

ఇన్సాకాగ్ కేంద్ర వైద్యారోగ్య శాఖ ప‌ర‌ధిలో ప‌నిచేస్తుంది. కొవిడ్ శాంపిల్స్ సీక్వెన్సింగ్ ద్వారా దేశ‌వ్యాప్తంగా సార్స్ కోవ్‌-2 జీనోమిక్ స‌ర్వైలెన్సికు సంబంధించిన నివేదిక‌లు రూపొందిస్తుంటుంది. కాగా, దేశంలో ఇవాళ కూడా 3,33,533 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దాంతో దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన మొత్తం కేసుల సంఖ్య 3,92,37,264కు పెరిగింది. ప్ర‌స్తుతం 21,87,205 యాక్టివ్ కేసులు ఉన్నాయి.