Patna, October 3: బీహార్ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌కు (Bihar Chief Minister Nitish Kumar) చేదు అనుభవం ఎదురైంది. ఎన్నడూ లేనిది ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు ప్రజల నుంచి తీవ్ర నిరసన ఎదురవుతోంది. మధుబనిలోని హర్లాఖిలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో (Harlakhi Election 2020) మాట్లాడుతుండగా నితీష్‌పైకి ఉల్లిపాయలు విసిరారు. సరిగ్గా ఆయన నిరుద్యోగం గురించి చెప్పడం ప్రారంభించగానే ఇది జరిగింది. చూస్తుండగానే జనాలు ఉల్లిపాయలు విసరడం (Onions Hurled at Bihar CM) ఎక్కువైంది. దీంతో అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది, నితీష్‌ను చుట్టు ముట్టి మీద పడకుండా అడ్డుకున్నారు.
నితీశ్ కుమార్ ఫెయిల్యూర్ సీఎం అంటూ నినాదాలు చేశారు. ఇప్పటి వరకు నితీశ్ కుమార్ బిహార్‌కు ఐదుసార్లు సీఎంగా పనిచేశారు. ఎన్నికల ప్రచారంలో ఆయన ఉద్యోగాల విషయం గురించి మాట్లాడగానే ఆయనపై రాళ్లు విసిరారు. దీంతో స్టేజ్ మీద ఉన్నప్పుడే నితీశ్‌కు కోపం వచ్చింది. ఇంతలో ఆయన వ్యక్తిగత సిబ్బంది ఆయనకు రాళ్లు తగలకుండా అడ్డుగా నిలిచారు. రాళ్లదాడి చేసిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకోగా వారిని ఏం చేయొద్దని క్షమించి వదిలేయాలని నితీశ్ అన్నారు.
Watch: Onions pelted at Bihar CM Nitish Kumar in Madhubani
#Correction: Onions pelted during Chief Minister Nitish Kumar's election rally in Madhubani's Harlakhi.#BiharPolls pic.twitter.com/0NwXZ3WIfm
— ANI (@ANI) November 3, 2020
ఇక నితీశ్‌పై దాడి చేయడం ఇదేమీ తొలిసారి కాదు 2018లో నందన్ అనే గ్రామంలో దళితులు, మహిళలపై దాడుల నేపథ్యంలో నితీశ్ కాన్వాయ్ పై దాడి జరిగింది. ఇప్పుడు ఎన్నికల సమయంలో జరిగిన ఈ దాడి ఎన్నికల ఫలితాలపై ఏవిధంగా ప్రభావం చూపనుందో తెలియాల్సి ఉంది. బిహార్ ఎన్నికల ఫలితాలు నవంబర్ 10వ తేదీన విడుదల కానున్నాయి.
నితీష్ కుమార్ సీఎం కాలేరంటూ చిరాగ్ పాశ్వాన్ జోస్యం, ఓటు హక్కును వినియోగించుకున్న పలువురు ప్రముఖులు
రాష్ట్రంలో మధ్య నిషేధం అమలులో ఉన్నప్పటికీ అమ్మకాలు మాత్రం జోరుగా సాగుతున్నాయంటూ ఉల్లిపాయలు విసురుతూనే ఉన్నారు. అయితే తనపైకి ఉల్లిపాయలు విసరడంపై స్పందిస్తూ ‘‘అతడిని అడ్డుకోకండి. విసరనివ్వండి. కావాల్సినన్ని విసరనివ్వండి’’ అని చెప్పుకొచ్చారు.