Delhi No relief from pollution(ANI)

New Delhi, NOV 14: వాయు కాలుష్య తీవ్రత పెరిగిపోవడంతో ఢిల్లీ సీఎం అతిషి (CM Athishi) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐదో తరగతి వరకు ఆన్ లైన్ తరగతులు (Online Classes) బోధించాలని అన్ని పాఠశాలలకు గురువారం ఆమె ఆదేశాలు జారీ చేశారు. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకూ ఐదో తరగతి వరకూ విద్యార్థులకు ఆన్ లైన్ తరగతులు నిర్వహించాలని ‘ఎక్స్’ వేదికగా పోస్టు పెట్టారు.

Online Learning In Schools Up To Class 5

 

ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలో (Delhi Pollution) వాయు కాలుష్యం ఆందోళనకర స్థాయికి చేరుకోవడంతో గ్రేటెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) -3 కింద ఎయిర్ క్వాలిటీ మేనేజ్ మెంట్ కమిషన్ సీఏక్యూఎం ఆంక్షలు జారీ చేసింది. ఢిల్లీలో వరుసగా రెండో రోజు వాయు నాణ్యత దాదాపు 400 పాయింట్లకు పడిపోయింది. ఈ నేపథ్యంలో వాయు కాలుష్య నియంత్రణకు కఠిన ఆంక్షలు అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. గ్రాప్ -3 ఆంక్షల ప్రకారం ఢిల్లీ పరిధిలో అత్యవసరం కాని నిర్మాణాలు, కూల్చివేతలపై నిషేధం అమల్లో ఉంటుంది.