Pak Agents Could Trap You By Posing As Women Online, Army Warns Soldiers (Photo-Twitter)

Punjab, Dec8: గత వారం పాకిస్తాన్ భూభాగంలోకి అనుకోకుండా వెళ్లిన జవాన్ తిరిగొచ్చిన ఘటన మరువకు ముందే మరో జవాన్ పాక్ భూబాగంలోకి వెళ్లాడు. భారత జవానును గుర్తించిన పాక్‌ రేంజర్లు ఆయనను తమ ఆధీనంలోకి (Pakistan Rangers capture BSF jawan) తీసుకున్నారు. సరిహద్దులో తీవ్రమైన పొగమంచు కారణంగా జీర్‌ లైన్‌ కనిపించకపోవడం వల్ల (crossed over IB inadvertently) జవాన్‌ పాకిస్తాన్‌ గడ్డపైకి వెళ్లినట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన బీఎస్‌ఎఫ్‌ ఫిరోజ్‌పూర్‌ సెక్టర్‌లో జరిగింది.

పంజాబ్‌లోని భారత్-పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దులోని అబోహర్‌ ప్రాంతంలో విధుల్లో ఉన్న ఓ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్) జవాన్ బుధవారం ఉదయం 7.40 గంటలకు మంచులో దారి కనపడకపోవడంతో పొరపాటున జీరో లైన్‌ను దాటి పాకిస్తాన్ భూభాగానికి చేరుకున్నాడు. పాకిస్తాన్ ప్రాంతానికి చేరుకోగానే పాక్ రేంజర్లు భారత జవాన్‌ను అరెస్ట్ చేశారు. సదరు జవాన్ బీఎస్‌ఎఫ్‌లోని 66 బెటాలియన్‌కు చెందినవాడు.

దట్టమైన పొగమంచు, అనుకోకుండా పాక్ భూబాగంలోకి వెళ్లిపోయిన భారత జవాన్, అరెస్ట్ చేసిన పాకిస్తాన్ ఆర్మీ అధికారులు, అత్యవసర సంప్రదింపులు తర్వాత జవాన్ విడుదల

జవాను సరిహద్దు దాటినట్లు సమాచారం అందిన వెంటనే ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. భారత జవాను తమ నిర్బంధంలో ఉన్నట్లు పాక్ రేంజర్లు ధృవీకరించారు. మన జవాన్‌ను తిరిగి పంపేందుకు పాక్‌ రేంజర్లు నిరాకరించారు.గత వారం కూడా ఓ బీఎస్‌ఎఫ్‌ జవాను ఇలాగే దారి తప్పి పాక్‌ భూభాగంలో వెళ్లిపోయాడు. బీఎస్‌ఎఫ్‌ అధికారులు పాక్‌ రేంజర్లను సంప్రదించి జవానును క్షేమంగా తీసుకురాగలిగారు. ప్రస్తుతం జవాన్‌ను వదిలిపెట్టడానికి పాక్‌ రేంజర్లు నిరాకరించడంతో బీఎస్‌ఎఫ్‌ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.