New Delhi, Dec 6: ఉత్తరాది రాష్ట్రాలను 'గోమూత్ర' రాష్ట్రాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన డీఎంకే (DMK) ఎంపీ డీఎన్‌వీ సెంథిల్ కుమార్ (DNV Senthil kumar) పార్లమెంటుకు బుధవారంనాడు క్షమాపణ చెప్పారు. తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేశారు. రికార్డుల నుంచి తన వ్యాఖ్యలను తొలగించాల్సిందిగా సభాపతిని కోరారు.
జమ్మూకశ్మీర్‌కు చెందిన రెండు బిల్లులపై లోక్‌సభలో మంగళవారంనాడు జరిగిన చర్చలో ఆయన(DMK MP DNV Senthilkumar) మాట్లాడుతూ, బీజేపీ గెలిచిన రాష్ట్రాలు హిందీ బెల్ట్‌లో ఉన్నవేనని, వీటిని సహజంగా గోమూత్ర రాష్ట్రాలుగా (Gaumutra) పిలుస్తామని అన్నారు. బీజేపీ దక్షిణాదికి రాలేదని, అక్కడ ఎలాగూ అడుగు మోపలేరు కాబట్టి ఆయా రాష్ట్రాలను కేంద్ర పాలిత రాష్ట్రాలు చేస్తారనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదన్నారు.
లోక్‌సభలో ఆయన చేసిన వ్యాఖ్యలపై అటు బీజేపీ సభ్యులు మండిపడ్డారు. ఉత్తరాది రాష్ట్రాలను డీఎంకే ఎంపీ సెంథిల్ కుమార్ గోమూత్ర రాష్ట్రాలు అని అభివర్ణించడంపై బీజేపీ ఎంపీ సాధ్వీ నిరంజన్ జ్యోతి తప్పుబట్టారు. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ లేదని సెంథిల్ చేసిన వ్యాఖ్యలపై సాధ్వీ మండిపడ్డారు. కర్ణాటకలో ఎక్కువ ఎంపీలు బీజేపీకి చెందినవారేనని మర్చిపోవద్దని గుర్తుచేశారు. తెలంగాణలోనూ ముగ్గురు ఎంపీలు, ఇటీలవ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు విజయం సాధించిన విషయాన్ని ప్రస్తావించారు. దేశాన్ని విభజించే వ్యాఖ్యలు చేయరాదని హితువు పలికారు. సెంథిల్ వ్యాఖ్యలపై సోనియాగాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
Here's Videos
#WATCH | Winter Session of Parliament | DMK MP DNV Senthilkumar S expresses regret over his 'Gaumutra' remark and withdraws it.
"The statement made by me yesterday inadvertently, if it had hurt the sentiments of the Members and sections of the people, I would like to withdraw… pic.twitter.com/S0cjyfb7HU
— ANI (@ANI) December 6, 2023
కే ఎంపీ సెంథిల్ కుమార్ గోమూత్ర వ్యాఖ్యలపై సభలో గందరగోళం నెలకొంది.దీంతో డీఎంకే ఎంపీ సెంథిల్ కుమార్ గోమూత్ర వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. తాను ఉద్దేశపూర్వకంగా ఆ వ్యాఖ్యలు చేయలేదని పేర్కొంటూ.. ప్రజల మనోభావాలు దెబ్బతింటే ఉపసంహరించుకుంటాను అని తెలిపారు.నేను చేసిన వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగించాలని కోరుతున్నారు. నా వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తున్నాను'' సెంథిల్ కుమార్ లోక్‌సభకు తెలిపారు.
'ఇండియా' బ్లాక్ కూటమిలో ఉన్న పలువురు నేతలు కూడా డీఎంకే ఎంపీ వ్యాఖ్యలను ఖండించాయి. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ తమ ఇష్టానికి అనుగుణంగా ఓటు వేస్తారని, వారిని తక్కువ చేసి మాట్లాడటం సరికాదని పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ వ్యాఖ్యానించారు. సెంథిల్ కుమార్ తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పి, వాటిని ఉపసంహరించుకోవాలి కాంగ్రెస్ లోక్‌సభ సభ్యుడు కార్తీ చిదంబరంలో మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.