New Delhi, March 26: సామాన్యులకు మరోసారి షాక్ ఇచ్చాయి ఆయిల్ సంస్థలు (Oil Companies). ఈ వారంలో నాలుగోసారి ఇంధన ధరలు (Fuel Prices) పెరిగాయి. తాజాగా పెట్రోల్, డీజిల్ లీటరుకు 90 పైసలు పెంచాయి. దీంతో తెలంగాణలో (Telangana) పెట్రోల్ పై 89, డీజిల్ పై 86 పైసలు పెరిగాయి. ఇవాళ హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ రూ. 111.80, డీజిల్ 98.10 పెరిగాయి. ఏపీలో పెట్రోల్ పై 86, డీజిల్ పై 80 పైసలు పెరిగాయి. దీంతో గుంటూరులో లీటర్ పెట్రోల్ రూ. 113.82,డీజిల్ 99.76కు చేరాయి. విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ. 113.62, డీజిల్ 99.56కు పెరిగాయి. ఢిల్లీలో పెట్రోల్, డీజిల్ పై 80 పైసలు పెరిగాయి. దీంతో హస్తినలో లీటర్ పెట్రోల్ రూ. 98.61 ,డీజిల్ రూ. 89.87కు చేరాయి. ముంబైలో లీటర్ పెట్రోల్ రూ. 113.35, డీజిల్ రూ. 97.55కు పెరిగాయి.
Price of petrol & diesel in Delhi at Rs 98.61 per litre & Rs 89.87 per litre respectively today (increased by 80 paise)
In Mumbai, the petrol & diesel prices per litre at Rs 113.35 & Rs 97.55 (increased by 84 paise & 85 paise respectively)
(File pic) pic.twitter.com/9r1RQSvTH8
— ANI (@ANI) March 26, 2022
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గతేడాది నవంబరు 4 నుంచి ఈ సంవత్సరం మార్చి 21 వరకు చమురు కంపెనీలు ధరలు పెంచలేదు. ఐదు రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు రూ. 3.20 పెరిగాయి. మార్చి 22 నుంచి చమురు ధరలు పెరుగుతున్నాయి.
ఎన్నికల ఫలితాలు వచ్చిన 11 రోజుల్లోనే మళ్లీ ధరలు పెంచడంతో సామాన్యుడికి కష్టాలు తప్పడం లేదు. మరోవైపు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ధరలు పెంచకపోవడంతో I.O.C, B.P.C.L, H.P.C.L కంపెనీలకు 19 వేలకోట్ల రూపాయల నష్టం వచ్చిందని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీసెస్ పేర్కొంది. ఈ నష్టాలను పూడ్చాలంటే ధరలు పెంచక తప్పనిసరి పరిస్థితి ఏర్పడిందని తెలిపింది.
అటు పెరుగుతున్న ఇంధన ధరలపై కేంద్ర ప్రభుత్వాన్ని విపక్షాలు తీవ్రంగా విమర్శించాయి. సామాన్యులపైనా, పేదలపైనా మోదీ సర్కారు యుద్ధం చేస్తోందని లోక్‌సభలో విపక్షాలు ఆరోపిస్తున్నాయి. వెంటనే ఇంధన ధరలకు కళ్లెంవేసి, సామాన్యుడిపై భారాన్ని తగ్గించాలని కోరాయి.