New Delhi, OCT 23: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) రెండు రోజుల రష్యా పర్యటన ముగిసింది. 16వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో (BRICS Summit) పాల్గొన్న ఆయన.. రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ సహా పలువురు దేశాధినేతలతో చర్చలు జరిపారు. ఉజ్బెకిస్థాన్, యూఏఈ అధ్యక్షులతోనూ భేటీ అయ్యారు. మోదీ రష్యా పర్యటన విజయవంతంగా కొనసాగిందని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. బ్రిక్స్ సదస్సులో ప్రసంగించిన మోదీ.. దౌత్యం, చర్చలకు భారత్ మద్దతిస్తుందని, యుద్ధానికి కాదని పునరుద్ఘాటించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియాలో కల్లోల పరిస్థితులు, ఆర్థిక అస్థిరత, వాతావరణ మార్పులు, ఉగ్రవాదం వంటి పలు సమస్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచాన్ని సరైన మార్గంలో తీసుకువెళ్లడంలో బ్రిక్స్ సానుకూల పాత్ర పోషిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
PM Modi emplanes for Delhi after taking part in BRICS Summit
#WATCH | Prime Minister Narendra Modi emplanes for Delhi after attending the 16th BRICS Summit in Kazan, Russia.
(Source: DD News) pic.twitter.com/gF6bE4ZId2
— ANI (@ANI) October 23, 2024
పర్యటన తొలిరోజు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో (Modi Meet Putin) భేటీ కాగా, రెండోరోజు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ప్రాంతీయంగా శాంతి-సుస్థిరత సత్వరం నెలకొనేందుకు తాము పూర్తి మద్దతు ఇస్తామని పుతిన్‌తో చెప్పారు. ఇటు భారత్-చైనా సరిహద్దులో శాంతి, స్థిరత్వం కొనసాగించడమే తమ ప్రధాన లక్ష్యంగా ఉండాలని జిన్‌పింగ్‌కు పిలుపునిచ్చారు. ఇదిలాఉంటే, మూడు నెలల్లోనే రష్యాలో మోదీ రెండోసారి పర్యటించారు.