PM Modi Unveils 108-feet Statue of Hanuman: హనుమాన్ జయంతి సందర్భంగా, గుజరాత్‌లో 108 అడుగుల భారీ హనుమాన్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని నరేంద్రమోదీ
(Image: Twitter)

హనుమాన్ జయంతి సందర్భంగా.. గుజరాత్ లోని మోర్బి జిల్లాలో ఏర్పాటు చేసిన 108 అడుగుల భారీ హనుమాన్ విగ్రహాన్ని ప్రధాని నరేంద్రమోదీ ఆవిష్కరించారు. ఈ ఆవిష్కరణ వర్చవల్ విధానంలో జరిగింది. ఈ పుణ్య కార్యంలో పాల్గొనడం గౌరవంగా భావిస్తున్నట్లు ప్రధాని తెలిపారు. ఈ మేరకు ప్రధాని ట్వీట్ చేశారు.

"నేడు హనుమాన్ జయంతి పర్వదినాన్ని జరుపుకుంటున్నాం. మోర్బిలో ఉదయం 11 గంటలకు 108 అడుగుల హనుమాన్ విగ్రహావిష్కరణ జరుగుతోంది. ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు లభించడాన్ని గౌరవంగా భావిస్తున్నాను" అంటూ ప్రధాని ట్వీట్ చేశారు. హనుమాన్ జీ చార్ ధామ్ ప్రాజెక్టు కింద దేశవ్యాప్తంగా నాలుగు ఎత్తయిన హనుమాన్ విగ్రహాలను ఏర్పాటు చేస్తుండగా.. అందులో ఇది రెండోది.