Bellary, April 07: లోక్‌సభ ఎన్నికల వేళ కర్ణాటకలోని బళ్లారిలో (Bellary) భారీ మొత్తంలో పోలీసులు డబ్బు, బంగారం, వెండిని స్వాధీనం (Cash Seize) చేసుకున్నారు. బళ్లారి కార్పెట్ బజార్‌లో స్వాధీనం చేసుకున్న వాటికి పత్రాలు లేవని చెప్పారు. హేమా జ్యువెలర్స్ యజమాని నరేశ్ సోనీని పోలీసులు విచారిస్తున్నారు. అవి ఆయనకు చెందిన బంగారం, వెండి, డబ్బుగా పోలీసులు గుర్తించారు. మొత్తం 5 కోట్ల 60 లక్షల రూపాయల డబ్బు, 103 కిలోల ఆభరణాల వెండి, 3 కిలోలు బంగారం స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. పక్కా సమాచారం మేరకు దాడి చేసినట్లు ఎస్పీ రంజిత్ కుమార్ తెలిపారు.
Money Seize: ಅಬ್ಬಬ್ಬಾ.. ದುಡ್ಡು ನೋಡಿ.. ಅಧಿಕಾರಿಗಳೇ ಕಂಗಾಲ್!#tv9kannada #Lokasabahaelections #Moneyseize #Money #Ballary #Bellary #MPElection #Siddaramaiah #Dkshivakumar #Dks #Vijayendra #BSY #Rashoka pic.twitter.com/7LjrzbnxG6
— TV9 Kannada (@tv9kannada) April 7, 2024
ఆ డబ్బు ఏ పార్టీకి చెందినదో స్పష్టంగా తెలియరాలేదని అన్నారు. దీనిపై విచారణ జరుగుతోందని తెలిపారు. కేపీ చట్టం కింద ఫిర్యాదు నమోదైందని చెప్పారు. డబ్బు, బంగారం దేవాదాయ శాఖకు చేరవేసి తదుపరి చర్యలు తీసుకుంటున్నారు. కాగా, లోక్‌సభ ఎన్నికల వేళ నగదు ప్రవాహాన్ని అడ్డుకునేందుకు దేశవ్యాప్తంగా ఎన్నికల కమిషన్, పోలీసులు నిఘా పెట్టారు.