New Delhi December 25: మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి 97వ జయంతి(Former PM Atal Bihari Vajpayee's birth anniversary) సందర్భంగా పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. ఢిల్లీలోని ఆయన స్మృతివనం వద్ద రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్(President Ram Nath Kovind), ప్రధాని నరేంద్రమోడీ(Prime Minister Narendra Modi), లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా(Om Birla), రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Rajnath Singh), కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah), కేంద్రమంత్రి పియూష్ గోయల్ తో పాటూ పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు.
Delhi | President Ram Nath Kovind and Prime Minister Narendra Modi pay floral tribute at ‘Sadaiv Atal’ on former PM Atal Bihari Vajpayee's birth anniversary
Source: DD News pic.twitter.com/lMRroPtF8t
— ANI (@ANI) December 25, 2021
అటల్ బిహారి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రముఖులు ఆయన సేవలను స్మరించుకున్నారు. ట్విట్టర్‌లో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, పలువురు కేంద్రమంత్రులు అటల్ జీ సేవలను గుర్తు చేసుకున్నారు. వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రతీ ఏటా గుడ్ గవర్నెన్స్ డే(Good Goverence Day) గా నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. పరిపాలనలో ఆయన సంస్కరణలకు గుర్తుగా ప్రతీ ఏడాది డిసెంబర్ 25ను సుపరిపాలన దినోత్సవంగా జరుపుకుంటున్నారు.