Bhopal, DEC 04: స్కూల్‌లో టీచర్‌గా పని చేస్తున్న మహిళను ప్రిన్సిపాల్ వేధించాడు. మద్యం సేవించిన అతడు తనతో కలిసి మందు తాగాలని, సిగరెట్ కాల్చాలని బలవంతం చేశాడు. (Principal Forces Teacher To Drink Alcohol ) తన మాట వినని ఆమెను మరునాడు స్కూల్‌లో అవమానించాడు. మోకాళ్లపై కూర్చొమన్నాడు. ఆ ప్రిన్సిపాల్ వేధింపులు భరించలేని ఆ టీచర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ఈ సంఘటన జరిగింది. కాన్వెంట్ స్కూల్‌కు చెందిన ప్రిన్సిపాల్ క్షితిజ్ జాకబ్ పని సాకుతో ఉపాధ్యాయురాలిని బయటకు తీసుకెళ్లాడు. అక్కడ మద్యం సేవించిన అతడు మందు తాగాలని, స్మోక్ చేయాలని ఆమెను బలవంతం చేశాడు. అభ్యంతరం చెప్పిన ఆ టీచర్‌ను మరునాడు స్కూల్ ముందు అవమానించాడు. మోకాళ్లపై కూర్చొవాలంటూ వేధించాడు.
కాగా, ఆ ఉపాధ్యాయురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. రెండేళ్లుగా ఆ ప్రిన్సిపాల్ తనను వేధించడంతోపాటు తనపట్ల అనుచితంగా ప్రవర్తించినట్లు ఆమె ఆరోపించింది. ఉద్యోగం నుంచి తీసేస్తానని బెదిరించడంతో ఇప్పటి వరకు మౌనంగా ఉన్నట్లు తెలిపింది. తాజా వేధింపులను భరించలేక న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించినట్లు చెప్పింది. మరోవైపు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ స్కూల్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. అలాగే అక్కడి సిబ్బంది స్టేట్‌మెంట్లను రికార్డ్ చేశారు. లేడీ టీచర్‌ను వేధించిన స్కూల్ ప్రిన్సిపాల్‌పై తగిన చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారి వెల్లడించారు.