Droupadi Murmu. (Credits: ANI)

New Delhi, OCT 19: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Murmu) స్వస్థలం ఒడిశాలోని రాయ్‌రంగ్‌పూర్‌, బాదంపహార్‌ రూట్‌లో మొట్టమొదటిసారిగా ప్యాసింజర్‌ రైలు (Passenger Train) సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి. టాటా-బాదంపహార్‌ రూట్‌లో మెయిల్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ప్రారంభిస్తున్నట్టు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ బుధవారం వెల్లడించారు. ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న స్థానికుల డిమాండ్‌ను నెరవేర్చామని ఆయన అన్నారు.

Jharkhand: తండ్రి అంటే ఇలా ఉండాలి, అత్తగారింట్లో వేధింపులకు గురవుతున్న కూతురును మేళతాళాలతో పుట్టింటికి తెచ్చుకున్న వీడియో ఇదిగో.. 

రాష్ట్రపతి సొంత జిల్లా మయూర్‌భంజ్‌కు మూడు కొత్త రైళ్లను కేటాయించినట్టు తెలిపారు. ప్రతి శనివారం షాలిమార్‌లో బయల్దేరే వీక్లీ ఎక్స్‌ప్రెస్‌, బాదంపహార్‌కు అదే రోజు సాయంత్రం 5.40కు చేరుకుంటుంది. బాదంపహార్‌-రూర్కెలా వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ ప్రతి ఆదివారం ఉదయం బాదంపహార్‌ నుంచి బయల్దేరుతుంది.