క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరు న‌గ‌రంలోని రామేశ్వ‌రం కేఫ్‌లో శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం భారీ పేలుడు (Bengaluru Blast Video) సంభ‌వించిన సంగ‌తి తెలిసిందే. అందరూ గ్యాస్ సిలిండర్ పేలిందని అనుకుంటున్న సమయంలో అది బాంబు పేలుళ్లే అని సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు. ఓ వ్య‌క్తి కేఫ్‌లో బ్యాగు పెట్టి వెళ్లిన దృశ్యాలు అక్క‌డున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయ‌ని తెలిపారు.ఆ బ్యాగులో ఉన్న ఐఈడీ కార‌ణంగానే పేలుళ్లు జ‌రిగాయ‌ని పేర్కొన్నారు.ఈ పేలుడు ధాటికి 9 మందికి తీవ్ర గాయాల‌య్యాయి.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది.వీడియోలో ఒక్కసారిగా పేలుడు సంభవించగానే చుట్టూ పొగతో కూడిన చిమ్మ చీకటి అలముకుంది.  బెంగుళూరు రామేశ్వ‌రం కేఫ్ పేలుడు వీడియో ఇదిగో, ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలడంతో బయటకు పరుగులు పెట్టిన ప్రజలు

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)