Image used for representation purpose only | Photo: PTI

గౌహతి, మార్చి 16 : అసోం రాష్ట్రంలో దిశ తరహా ఘటన చోటుచేసుకుంది. యువతిపై అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడిని (Rapist Encounter) పోలీసులు ఎన్ కౌంటర్ చేశారని వెల్లడించింది. గరియాన్ లో ఓ హోటల్ లో మైనర్ పై లైంగిక దాడి జరిగినట్లు పోలీసులకు సమాచారం అందింది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్నారు పాన్ బజార్ మహిళా పోలీసులు. ఈ ఘటనలో బికీతో పాటు నలుగురు స్నేహితులు ఉన్నారని దర్యాప్తులో వెల్లడైంది. అత్యాచారం అనంతరం పారిపోయిన వీరి కోసం పోలీసులు గాలించారు. ప్రధాన నిందితుడైన బికీ గురించి సమాచారం అందడంతో అతడిని మంగళవారం అదుపులోకి తీసుకోవడం జరిగిందని పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించి ANI వార్తా సంస్థ ట్వీట్ చేసింది.

అయితే..కస్టడీలో ఉన్న బికి అలీ పారిపోయేందుకు ప్రయత్నించాడని, తాము ఆపేందుకు యత్నించగా.. దాడికి పాల్పడ్డాడని పోలీసులు వెల్లడించారు. దాడిలో ఇద్దరు మహిళా పోలీసులకు గాయాలయ్యాయయని తెలిపారు. లొంగిపోవాలని హెచ్చరించినా అతను వినిపించుకోలేదని, ఆత్మరక్షణార్థం అతడిపై కాల్పులు జరిపినట్లు తెలిపారు. మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.