New Delhi, JAN 04: ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను (CM Arvind Kejriwal) అరెస్టు చేస్తారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కొట్టిపారేసింది. అవన్నీ వట్టి వదంతులేనని (Rumours) ఈడీ వర్గాలు స్పష్టం చేశాయి. కేజ్రీవాల్ ఇంటిపై దాడులు చేయాలని, సోదాలు నిర్వహించాలన్న ప్లాన్ ఏమీ లేదని వెల్లడించాయి. కాగా, గురువారం ఉదయం కేజ్రీవాల్ ఇంటిపై ఈడీ దాడులు (Raids) చేయనుందని, అనంతరం ఆయనను అదుపులోకి తీసుకుంటారని మంత్రులు అతిశి, సౌరభ్ భరద్వాజ్‌తోపాటు ఆప్ నేతలు ఎక్స్ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఈడీ వర్గాల (ED) నుంచి తమకు సమాచారం ఉందని బుధవారం రాత్రి వరుస ట్వీట్లు చేశారు. ‘అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో గురువారం ఉదయం ఈడీ దాడి చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి’ అంటూ బుధవారం రాత్రి 11.50 గంటలకు మంత్రి అతిశి ట్వీట్ చేశారు. రెండు నిమిషాల తర్వాత మరో మంత్రి సౌరభ్ భరద్వాజ్ ఇదే విషయాన్ని హిందీలో పోస్ట్ చేశారు. ఈడీ గురువారం ఉదయం కేజ్రీవాల్ ఇంటికి చేరుకుంటుందని, ఆయనను అరెస్ట్ చేసే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. అయితే ఇదంతా వట్టిదేనని ఈడీ వర్గాలు వెళ్లడించాయి. విచారణకు రాలేనంటూ కేజ్రీవాల్ రాసిన లేఖను పరిశీలిస్తున్నామని తెలిపాయి.
Delhi | Security heightened outside the residence of Delhi CM & AAP leader Arvind Kejriwal
AAP Minister Atishi, in a post on social media X last night, claimed that they had information about the possible arrest of Arvind Kejriwal after a raid by the Enforcement Directorate at… pic.twitter.com/IlpkzbjOmy
— ANI (@ANI) January 4, 2024
ఢిల్లీ మద్యం కేసులో ఈడీ మూడోసారి సమన్లు జారీచేసింది. దీనిపై కేజ్రీవాల్ (Kejriwal) స్పందిస్తూ.. రాబోయే రాజ్యసభ ఎన్నికల్లో తలమునకలై ఉన్నానని, రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా అనేక ముఖ్య కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉన్నందున విచారణకు రాలేనని, ఈడీ తాను అడగాల్సిన ప్రశ్నలను పంపితే సమాధానం ఇవ్వడానికి గానీ, అవసరమైన పత్రాలు సమర్పించడానికి గాని తాను సిద్ధంగా ఉన్నానని లేఖ రాశారు. అసలు తనను విచారణకు పిలవడానికి నిజమైన కారణం, పరిధి, స్వభావం, ఉద్దేశం తెలియజేయాలంటూ గతంలో రాసిన లేఖలపై దర్యాప్తు సంస్థ స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. దీనిపై ఈడీ మౌనం చూస్తుంటే ఏదో అవాంఛనీయ రహస్యాన్ని దాయడమే కాక, అపారదర్శకంగా, పక్షపాతంతో ఉన్నట్టు అనుమానాలు కలిగిస్తున్నాయని అందులో పేర్కొన్నారు.