Maharashtra December 19:  కోతి చేష్లలను ఎన్నో చూశాం. కానీ కోతి ప్రతీకారాన్నిచూశారా? (Monkeys Revenge) మహారాష్ట్ర(Maharashtra)లో ఇప్పుడు అదే జరుగుతోంది. గత కొద్దిరోజులుగా మహరాష్ట్రలోని బీడ్ జిల్లా(Beed district) మజల్‌గావ్‌ (Majalgaon) లో కోతులు ప్రతీకారేచ్చ(Revengeful Monkeys)తో రగిలిపోతున్నాయి. ఇప్పటివరకు దాదాపు 250కి పైగా కుక్కలను(Allegedly Kill 250 Dogs) చంపేశాయి కొతులు. చిన్న కుక్క పిల్లలు కనిపిస్తే చాలు వాటిని ఎత్తుకెళ్లి బిల్డింగ్స్, చెట్ల మీద నుంచి కింద పడేస్తున్నాయి. దీంతో కోతుల రివేంజ్ స్టోరీ ఇప్పుడు హాట్ టాపిక్‌ గా మారింది.

కోతులు వర్సెస్‌ కుక్కల పోరాటానికి కొన్నాళ్ల క్రితం జరిగిన ఘటన బీజం వేసిందని మజల్‌గావ్‌ గ్రామస్తులు తెలిపారు. గతనెల్లో కొన్ని కుక్కలు ఒక కోతిపిల్లను వేటాడి చంపాయి. ఇది కోతుల మందలన్నింటినీ బాధించిందని, దీంతో అప్పటి నుంచి అవి కుక్కలపై మెరుపుదాడులకు దిగాయని తెలిపారు. ముఖ్యంగా కుక్కపిల్లలు కనిపిస్తే వెంటనే వాటిని ఎత్తుకుపోయి ఎత్తైన బిల్డింగ్‌ లేదా చెట్ల మీద నుంచి చచ్చేలా విసిరికొట్టడం ఆరంభించాయన్నారు.

Uttar Pradesh: పైసల్ ఎత్తుకుపోయిన కోతి, చెట్టుమీదకు ఎక్కి కుప్పిగంతులు, ఆపై ఉన్న డబ్బంతా గుమ్మరింపు, గుమిగూడిన జనం, గుంపులో డబ్బు మాయం

అలాగే పెద్ద కుక్కలు ఒంటరిగా కనిపిస్తే మందగా వెళ్లి దాడి చేసి చంపేస్తున్నాయి. వీటి దెబ్బకు దాదాపు 250 కుక్కలు ప్రాణాలు పోగొట్టుకున్నాయని, గ్రామంలో కుక్క అన్నది కనిపించకుండా పోయిందంటున్నారు గ్రామస్తులు. కోతుల అరాచకంపై అటవీశాఖకు ఫిర్యాదు చేశామని, వారు వచ్చి పరిస్థితి చూసినా, కోతులను పట్టడంలో విఫలమై వెనుదిరిగారని గ్రామస్తులు వివరించారు. క్రమంగా కోతులు కేవలం కుక్కలపైనే కాకుండా గ్రామస్తుల పిల్లలపై దాడులకు దిగుతున్నాయని వాపోయారు.

అయితే కోతులు ఇలా ప్రవర్తించడంపై నిపుణులు మాత్రం మరో కారణం చెప్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా వీటికి సరైన తిండి దొరకకపోవడంతో కోతుల్లో ఆగ్రహం పెరిగి ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు కోతుల రివేంజ్ స్టోరీ ఇంటర్నెట్ వైరల్‌ గా మారింది. వీటిపై రక రకాల మీమ్స్ కూడా షేర్ చేస్తున్నారు.