Uttar Pradesh: పైసల్ ఎత్తుకుపోయిన కోతి, చెట్టుమీదకు ఎక్కి కుప్పిగంతులు, ఆపై ఉన్న డబ్బంతా గుమ్మరింపు, గుమిగూడిన జనం, గుంపులో డబ్బు మాయం
Image used for representational purpose only. | Wikimedia Commons

Lucknow, October 04: ఎవరైనా తిక్కతిక్క పనులు చేస్తే వాళ్లను కోతి అని ఎందుకు పిలుస్తారో కోతి చేష్టలు చూస్తే అర్థమవుతుంది. ఓ వ్యక్తి కష్టపడి సంపాదించిన సొమ్ము ఒక దొంగ కోతి ద్వారా నష్టపోవాల్సి వచ్చింది. ఆయన దగ్గరున్న డబ్బు సంచిని ఎత్తుకెళ్లి చెట్టుమీదకెక్కి కూర్చుంది, దీనికావ్యక్తి తన డబ్బు వెనక్కి తీసుకునేందుకు ముప్పుతిప్పలుపడాల్సి వచ్చింది.

వివరాల్లోకి వెళ్తే, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని బడౌన్‌ (Badaun) పట్టణంలో ఒక వ్యక్తి బ్యాంకులో డిపాజిట్ చేయడానికి డబ్బు సంచితో వెళ్తున్నాడు, ఇంతలో ఒక కోతి అతడి చేతిలోని డబ్బు సంచిని లాగేసుకుందే అతడు గట్టిగా అరుస్తుండగానే పరుగెత్తుకుంటూ వెళ్లి ఒక చెట్టుమీదకెక్కి కూర్చుంది. ఆ వ్యక్తి కోతిని ఎంతగా బ్రతిమిలాడినా డబ్బు సంచి వెనక్కి ఇవ్వలేదు, ఇంతలో జనాలు కూడా బాగా గుమిగూడారు. ఆ సంచిని కోతి చేతుల్లోంచి తీసుకునేందుకు దానివైపు కొన్ని తినేపదార్థాలను విసిరారు, వాటిని తిరిగి విసిరికొట్టింది తప్ప డబ్బు సంచిని మాత్రం విడిచిపెట్టలేదు. ఆపై ఆ సంచిని చింపడం ప్రారంభించి, అందులోని నోట్లను చెట్టు పైనుంచి వెదజల్లడం ప్రారంభించింది. దీంతో బాధితుడు ఒక్కొక్కనోటు ఒక్కొక్క నోటు ఏరుకోవడం ప్రారంభించాడు. మిగతా జనం కూడా డబ్బును ఏరుకున్నారు.  (ఈగలకు కూడా మనసుంటుంది. అందులో ఒక గ్రాము ప్రేమ కూడా ఉంటుంది)

ఏరుకున్న నోట్లన్ని లెక్కేసుకోగా దాంట్లో రూ. 10 వేల వరకు తక్కువగా ఉన్నట్లు బాధితుడు వాపోయాడు. తన సంచిలో మొత్తం రూ, 65 వేలు ఉండగా నోట్లు ఏరిన జనాలు కొంతమంది  ఆ వ్యక్తికి వెనక్కిఇచ్చేశారు, మరికొందరు తిరిగి ఇవ్వలేదు. దీంతో రూ. 56 వేల వరకు మాత్రమే తిరిగి పొందగలిగినట్లు ఆ బాధితుడు పేర్కొన్నాడు.