Love Failure: ఈగలకు కూడా మనసుంటుంది. అందులో ఒక గ్రాము ప్రేమ కూడా ఉంటుంది. మగ ఈగలు చాలా సున్నిత స్వభావం కలవి, మగ ఈగ  ప్రేమను ఆడ ఈగ తిరస్కరిస్తే అది ఏం చేస్తుందో తెలుసా? సైంటిస్టులు ఏం చెప్తున్నాతో తెలుసుకోండి.
Image used for representational purpose only | (Photo Credits: Pexels)

భావోద్వేగాలు (Emotions) మనుషులకు మాత్రమే సొంతం  కాదు. ఏ జీవి భావోద్వేగాలకు అతీతం కాదు. మనుషుల్లాగే తమ బిడ్డల పట్ల ఇతర జీవులు వాత్సల్యం చూపిస్తాయి, నొప్పికి బాధపడతాయి. సృష్టిలో ఉండే అన్ని జీవాలు పరిస్థితులకు అనుగుణంగా స్పందిస్తాయి.

అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మనిషికి,  మరోజీవికి ఒక విషయంలో చాలా దగ్గర సంబంధం ఉంది.

అదేంటంటే సాధరణంగా మనుషుల్లో కొంత మంది తమ బాధను మరిచిపోవటానికి మద్యం సేవిస్తారు. ముఖ్యంగా వారి రిలేషన్‌షిప్‌లో ఏవైనా ఒడిదుడుకులు ఉన్నప్పుడు లేదా ప్రేమ విఫలమైనపుడు వారు మందు తాగుతారు. సరిగ్గా ఇలాంటి సందర్భాల్లో ఈగ (Fruit Fly) కూడా అలాగే ప్రవర్తిస్తుందట.

ఒక రీసెర్చ్ ప్రకారం ఏం తేలిందంటే మగఈగ,  ఆడఈగ నుంచి సాన్నిహిత్యాన్ని (Love Making) కోరుకుంటుంది. ఒకవేళ ఆడఈగ నుంచి మగఈగ తిరస్కరణకు గురైతే అది చాలా అసాధరణంగా ప్రవర్తిస్తుందట. మామూలుగా రెండు మగఈగలు ఉన్నప్పుడు ఆడఈగ అప్పటికే ఒకదానితో కలిస్తే రెండో ఈగను నిరాకరిస్తూ ఎగిరిపోతుంది, అప్పుడు అప్పటికే ఆడఈగను కలిసిన మొదటి మగఈగ సంతోషంగా ఎప్పట్లాగే ఎగురుతుంది, అలాగే దాని ఆహారంలో ఎలాంటి మార్పు ఉండదు. అదేసమయంలో తిరస్కరణకు గురైన మగఈగ ఆహరం విషయంలో మార్పు గమనించారట. అంతేకాకుండా తిరస్కరణకు గురైన మగఈగలు, అల్కాహాల్ సంబంధమైన లేదా మత్తు కలిగించే పువ్వుల మకరందాలను, మత్తు కలిగించే పండ్ల రసాలను పీలుస్తుందని వారి రీసెర్చిలో వెల్లడైంది.

దీనిని బట్టి ఏం తెలుస్తుంది? లైలా - మజ్ఞులు, పారు- దేవదాసుల కథలు మనుషుల్లోనే కాదు ఈగల్లో కూడా ఉంటాయని. మగ ఈగ కూడా ప్రేమలో విఫలమైతే దేవదాసుగా మారిపోతుంది అని. ఈ విషయం రాజమౌళికి తెలిస్తే బాగుండు. 'ఈగ' సినిమాకి సీక్వెల్ గా 'ఈగ 2.0', 'ఈగ రిటర్న్' లాంటి సినిమాలు తీసేందుకు ఏమైనా అవకాశం ఉంటుంది.