Survival of the Richest Report: భారత్‌లోని 10 మంది బిలియనీర్లపై 2 శాతం పన్ను విధిస్తే దేశం రూపురేఖలే మారిపోతాయి, దేశ అపర కుబేరుల సంపదపై దిమ్మతిరిగే నిజాలు
Image used for representational purpose | (Photo Credits: PTI)

New Delhi, Jan 16: భారతదేశంలో ధనికుల సంపదపై ఆక్స్‌ఫామ్ ఇంటర్నేషనల్ (Oxfam International Report) దిమ్మతిరిగే వాస్తవాలను వెల్లడించింది. భారత్ లో సంపన్నులు 1 శాతం ఉంటే.. దేశం మొత్తం సంపద‌లో 40 శాతం వాళ్ళ దగ్గరే ఉందని (Richest 1% Indians own more than 40% of country's wealth) నివేదికలో బట్టబయలు చేసింది. ఇక సగం జనాభా దగ్గర ఉన్న సంపద కేవలం 3 శాతం మాత్రమేనని ఆ నివేదిక తెలిపింది.దావోస్‌ వేదికగా జనవరి 16 నుంచి జనవరి 20 వరకు వరల్డ్‌ ఎకనమిక్స్‌ ఫోరమ్‌ వార్షిక సమావేశాలు ప్రారంభం అయిన సంగతి విదితమే.

ఈ సమావేశాల్లోని తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా పేదరికాన్ని నిర్మూలించేందుకు ప్రారంభమైన స్వచ్ఛంద సంస్థ ఆక్స్‌ఫామ్ ఇంటర్నేషనల్ ‘సర్వైవల్‌ ఆఫ్‌ ది రిచెస్ట్‌’ పేరుతో ఓ నివేదికను (Survival of the Richest Report) విడుదల చేసింది. ఆ నివేదికలో మనదేశ సంపన్నుల వివరాలు, వారి వద్ద ఉన్న సంపదతో ఏమేమి చేయొచ్చో తెలిపింది. ఆ నివేదిక ప్రకారం.. టాప్ 100 భారతీయ బిలియనీర్లకు 2.5 శాతం పన్ను విధించడం లేదా టాప్ 10 భారతీయ బిలియనీర్లపై 5 శాతం పన్ను విధించడం వల్ల పేదరికం కారణంగా చదువుకు దూరమైన పిల్లలను బడుల్లో చేర్పించవచ్చని తెలిపింది.

పాకిస్థాన్‌ను అతలాకుతలం చేస్తున్న ఆహార సంక్షోభం.. గోధమపిండి ట్రక్‌ వెనక బైక్‌లతో పౌరుల ఛేజింగ్.. వైరల్ వీడియో

ఇక ఫోర్బ్స్‌ జాబితా ప్రకారం.. 128.3 బిలియన్‌ డాలర్లతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో భారత్‌కు చెందిన గౌతమ్‌ అదానీ మూడో స్థానంలో ఉన్నారు. అయితే అదానీ 2017 నుంచి 2021 వరకు సంపాదించిన అవాస్తవిక లాభాలపై ఒక్కసారి ట్యాక్స్‌ విధిస్తే 1.79లక్షల కోట్లను సమీకరించవచ్చు. ఆ మొత్తాన్ని సంవత్సరానికి ఐదు మిలియన్లకు పైగా భారతీయ ప్రాథమిక పాఠశాల్లో ఉపాధ్యాయుల్ని నియమించుకునేందుకు సరిపోతుందని నివేదిక తెలిపింది.

రైతుల అకౌంట్లలో రూ. 4,813 ‍కోట్లు జమ చేసిన ఏపీ ప్రభుత్వం, వారి నుంచి రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసిన జగన్ సర్కారు, 21 రోజుల్లోపే రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బు జమ

ఆక్స్‌ఫామ్ నివేదిక ప్రకారం, భారతదేశంలోని బిలియనీర్లు వారి మొత్తం సంపదపై ఒకసారి 2% పన్ను విధించినట్లయితే, అది రాబోయే మూడేళ్లలో దేశంలో పోషకాహార లోపం ఉన్నవారి పోషకాహారం కోసం రూ. 40,423 కోట్ల అవసరానికి సరిపోతుందని నివేదిక తెలిపింది. దేశంలోని 10 మంది సంపన్న బిలియనీర్లపై 5 శాతం ఒకేసారి పన్ను (రూ.1.37 లక్షల కోట్లు కంటే 1.5 రెట్లు ఎక్కువగా సమీకరించవచ్చు.కాగా 2022-23లో కేంద్ర సంక్షేమ పథకాలైన హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ మినిస్ట్రీ (రూ.86,200 కోట్లు), మినిస్ట్రీ ఆఫ్‌ ఆయిష్‌ (రూ.3,050 కోట్లు) అంచనా వేసింది. ఈ రెండు కలుపుకుంటే రూ.1.37 లక్షల కోట్లు అవుతాయి.

లింగ అసమానతపై నివేదిక ప్రకారం ఒక పురుష కార్మికుడు సంపాదించేది రూపాయి అయితే మహిళా కార్మికులు కేవలం 63 పైసలు మాత్రమే పొందుతున్నారని నివేదిక పేర్కొంది.ఇక భారత్‌లో ఉన్న బిలియనీర్లలో ఒక్కసారి 2శాతం ట్యాక్స్‌ విధిస్తే రూ.40,423కోట్లను సమీకరించవచ్చు. ఆ మొత్తంతో వచ్చే మూడేళ్లలో దేశ మొత్తంలో పోషక ఆహార లోపంతో బాధపడుతున్న వారికి బలవర్ధకమైన ఆహారాన్ని అందించవచ్చు.

2022లో కరోనా మహమ్మారి ప్రారంభమైన నాటి నుంచి 2022 నవంబర్ వరకు భారతదేశంలోని బిలియనీర్లు తమ సంపద 121శాతం లేదా రోజుకు రూ. 3,608 కోట్ల మేర పెరిగినట్లు ఆక్స్‌ఫామ్ తెలిపింది. మరోవైపు, 2021-22లో దేశ వ్యాప్తంగా మొత్తం రూ. 14.83 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు అయ్యాయి. ఆ జీఎస్టీ దేశంలోని అట్టడుగు వర్గాల నుంచి 64 శాతం వస్తే, భారత్‌లో ఉన్న టాప్‌ 10 బిలియనీర్ల నుంచి కేవలం 3శాతం జీఎస్టీ వసూలైంది. ఇక భారతదేశంలో మొత్తం బిలియనీర్ల సంఖ్య 2020లో 102 కాగా 2022 నాటికి 166కు పెరిగిందని ఆక్స్‌ఫామ్ తెలిపింది.భారతదేశంలోని 100 మంది ధనవంతుల సంయుక్త సంపద USD 660 బిలియన్లకు (₹54.12 లక్షల కోట్లు) చేరుకుంది. ఈ మొత్తం 18 నెలల కంటే ఎక్కువగా కేంద్ర బడ్జెట్‌కు మరింత నిధులు సమకూర్చగలదు.

దేశంలోని సంపద అసమానత, బిలియనీర్ల సంపదను పరిశీలించేందుకు ఫోర్బ్స్,క్రెడిట్ సూయిస్ వంటి దిగ్గజ సంస్థల నివేదికల్ని ఆక్సోఫామ్‌ సంపాదించింది.అయితే నివేదికలో చేసిన వాదనలను ధృవీకరించడానికి ఎన్‌ఎస్‌ఎస్‌, యూనియన్ బడ్జెట్ పత్రాలు, పార్లమెంటరీ ప్రశ్నలు మొదలైన ప్రభుత్వ నివేదికలు ఉపయోగించింది. సంక్షోభ లాభదాయకతను అంతం చేయడానికి ఏకీకృత సంపద పన్నులు, విండ్‌ఫాల్ పన్నులను ప్రవేశపెట్టాలని కేంద్ర ఆర్థిక మంత్రిని కోరింది. 1% సంపన్నులపై పన్నులను శాశ్వతంగా పెంచాలని, ముఖ్యంగా తక్కువ పన్ను రేట్లకు లోబడి మూలధన లాభాలపై పన్నులను పెంచాలని డిమాండ్ చేసింది.