A representational picture of a beauty salon. (Photo credits: X/Pixabay)

Bangalore, SEP 29: మసాజ్ చేయించుకుంటున్నారా? తస్మాత్ జాగ్రత్త.. సరైన శిక్షణ పొందని వారితో మసాజ్ చేయించుకుంటే ప్రాణాలకే ముప్పు అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కర్నాటకలోని బళ్లారిలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. 30 ఏళ్ల వ్యక్తికి సెలూన్‌కి వెళ్లి తలకు మసాజ్ చేయించుకోవడం అతడి ప్రాణాల మీదకుతెచ్చింది. బార్బర్ షాపులో మెడకు మసాజ్ (Head Massage) వికటించడంతో యువకుడికి పక్షవాతం వచ్చింది. చికిత్స పొంది 2 నెలల పాటు విశ్రాంతి తీసుకున్న అతడు ఇప్పుడు కోలుకున్నాడని వైద్యులు చెప్పారు. సరైన శిక్షణ లేకుండా ప్రొఫెషనల్ కాని వారి నుంచి మసాజ్ (Massage) చేయించుకోవడం పట్ల జాగ్రత్త వహించాలని సూచనలు చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. నగరంలో నగరంలో హౌస్‌కీపర్‌గా పనిచేస్తున్న బళ్లారికి చెందిన యువకుడు అదృష్టవశాత్తూ ప్రాణపాయం నుంచి తప్పించుకున్నాడు. హెయిర్ కటింగ్ (Hair Cutting) కోసం సెలూన్‌కు వెళ్లినప్పుడు ఉచితంగా స్కాల్ప్ మసాజ్ చేయించుకున్నాడు. ఈ సందర్భంలో, బార్బర్ మెడను బలంగా మెలితిప్పడం తీవ్రంగా బాధించింది. అయినా అలానే ఇంటికి తిరిగొచ్చాడు. అయితే, ఓ గంటలోపే అతడి ఎడమవైపు భాగం స్తంభించి నోటి మాట తడబడింది. దీంతో ఆందోళన చెందిన బాధితుడు వెంటనే సమీప ఆస్పత్రికి వెళ్లి అడ్మిట్ అయ్యాడు.

పరీక్షించిన ఆస్పత్రి వైద్యులు.. అతడి మెడను బలంగా మెలితిప్పడం వల్ల సెఫాలిక్ ఆర్టరీ (మెడ నరాలు)లో నీరు చేరి మెదడులోని ప్రతినిధి భాగానికి రక్తప్రసరణ తగ్గడం వల్ల స్ట్రోక్ వచ్చిందని నిర్ధారించారు. ఆస్పత్రి వైద్యులు సీనియర్ న్యూరాలజిస్ట్ ఒకరు దీనిపై స్పందిస్తూ.. మెడను బలవంతంగా తిప్పడం వల్లే ఈ స్ట్రోక్ వచ్చిందని తెలిపారు. పక్షవాతం తీవ్రతరం కాకుండా ఉండేందుకు బాధితుడికి బ్లడ్ థిన్నర్‌తో చికిత్స అందించారు. పట్టణానికి వెళ్లి వైద్యం చేయించుకున్న అతడు దాదాపు రెండు నెలలు ఐసీయూలోనే ఉన్నాడు. ఆ తర్వాతే కోలుకున్నట్లు వైద్యులు తెలిపారు.

BJP MLA Rajasingh: తన ఇంటివద్ద రెక్కీ నిర్వహించడంపై స్పందించిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, తన ఫోటోలు ముంబైకి పంపినట్లు వెల్లడి, ఇద్దరిని పట్టుకున్న స్థానికులు 

ఈ రకమైన స్ట్రోక్ (Stroke), రక్తనాళాల గోడ దెబ్బతిన్నప్పుడు, మెదడుకు రక్త ప్రవాహాన్ని తగ్గిస్తుంది. ఆకస్మిక బలవంతంగా మెడ కదలికలు స్ట్రోకులు లేదా మరణంతో సహా తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. వెనుక నుంచి వచ్చి మెడ గుండా వెళ్ళే ఎముక, చుట్టుపక్కల నిర్మాణాలు చాలా సున్నితంగా ఉంటాయి. అకస్మాత్తుగా మెడ మెలితిప్పడం వల్ల ఈ సమస్య వస్తుంది. అందువల్ల సరైన శిక్షణ లేకుండా మసాజ్ చేయకూడదు. మసాజ్ థెరపిస్టులు కూడా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచించారు.

Fake Reporter: విలేఖరి అంటూ బ్లాక్ మెయిల్, చెట్టుకు కట్టేసి కొట్టిన స్థానికులు, హైడ్రా పేరుతో వసూళ్ల దందా..పటాన్‌చెరులో సంఘటన 

గతంలో ఇలాంటి ఘటనే ఒకటి వెలుగుచూసింది. హైదరాబాద్‌కు చెందిన 50 ఏళ్ల మహిళ నవంబర్ 2022లో సెలూన్‌లో హెయిర్ వాష్ చేస్తున్నప్పుడు తల తిరగడం, వికారం, వాంతులను అనుభవించింది. ఆ తర్వాత అది స్ట్రోక్‌గా వైద్యులు గుర్తించారు. తరచుగా ” సెలూన్ స్ట్రోక్ ” లేదా “బ్యూటీ పార్లర్ స్ట్రోక్” అని పిలిచే ఇలాంటి సంఘటనలు ఆకస్మిక, బలవంతంగా మెడ కదలికల వల్ల సంభవించవచ్చు. ఇది రక్త ప్రసరణ తగ్గించి మెదడు దెబ్బతినడానికి దారితీస్తుంది.