
New Delhi, June 6: దేశ వ్యాప్తంగా విధించిన కరోనావైరస్ లాక్‌డౌన్ కారణంగా వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న వలసదారులను (Migrant Crisis Row) వారి వారి స్వంత ప్రదేశాలకు చేర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు (Supreme Court) 15 రోజుల సమయం ఇచ్చింది. వలస కార్మికులపై జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్‌కే కౌల్, జస్టిస్ ఎంఆర్ షా నేతృత్వంలో ముగ్గురు సభ్యుల ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది. కేంద్ర తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కేసు విచారణకు హాజరయ్యారు. మహారాష్ట్రలో 80 వేల మార్కును దాటిన కోవిడ్ 19 కేసులు, ముంబైలో మెల్లిగా తగ్గుముఖం పడుతున్న కరోనావైరస్ వృద్ధి రేటు
ఈ సందర్భంగా ఆయన వాదనలు విన్నవిస్తూ.. రైల్వేశాఖ (Indian Railways) జూన్ 3వ తేదీ వరకు 4,228 ప్రత్యేక శ్రామిక్ రైళ్లను నడిపినట్లు తెలిపారు. వీటి ద్వారా 57 లక్షల మందిని ఇళ్లకు చేర్చినట్లు చెప్పారు. మరో 41 లక్షల మంది రోడ్డు మార్గంలో స్వస్థలాలకు చేరారన్నారు. మొత్తంగా వలస కార్మికులు దాదాపు కోటి మంది ఆయా నగరాలను వదిలారన్నారు. శ్రామిక్ రైళ్లలో ఎక్కువభాగం ఉత్తరప్రదేశ్, బిహార్‌కు నడిచినట్లు తెలిపారు. ఇంకా తరలించాల్సిన వారి వివరాలు ఇప్పటికే సేకరించినట్లు చెప్పారు.
రాష్ర్టాలు సైతం ఈ మేరకు వలస కార్మికుల జాబితాను సిద్ధం చేశాయన్నారు. ఇప్పటివరకు తరలించిన వలస కార్మికుల వివరాలను ఆయా రాష్ర్టాలు ఈ సందర్భంగా కోర్టుకు విన్నవించాయి. గుజరాత్ 20.50 లక్షలు, మహారాష్ట్ర 11 లక్షల మంది వలస కార్మికులన తరలించినట్లుగా చెప్పగా బిహార్ 28 లక్షల మంది వలస కార్మికులు తిరిగి రాష్ర్టానికి చేరుకున్నట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వాలకు 15 రోజులు గడువినిచ్చింది.