NEET-UG Paper Leak Case and Supreme Court (File Image)

New Delhi, July 05: నీట్ యూజీ-2024 పరీక్ష (NEET-UG 2024) పేపర్ లీక్‌ కావడం, గ్రేస్ మార్కుల కేటాయింపు వివాదం గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. పేపర్ లీక్ కావడంతోపాటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఏకపక్షంగా గ్రేస్ మార్కులు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ పలువురు విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. ఈ క్రమంలోనే పలువురు నీట్ యూజీ ఎగ్జామ్‌ను రద్దు చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు.ఆ పిటిషన్లపై ఇప్పటికే విచారణ చేపట్టిన దేశ అత్యున్నత న్యాయస్థానం.. కేంద్రాన్ని కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇవాళ కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. నీట్ యూజీ పరీక్షను (NEET UG Exam) రద్దు చేయబోమని ఆ అఫిడవిట్‌లో స్పష్టం చేసింది. నీట్ పరీక్షలో భారీ స్థాయిలో అక్రమాలు జరిగినట్లు సాక్ష్యాలు లేవని.. అందుకే ఈ పరీక్షను రద్దు చేయబోమని సెంట్రల్ గవర్నమెంట్ క్లారిటీ ఇచ్చింది.

NEET PG 2024 New Date Announced: నీట్‌ పీజీ పరీక్ష కొత్త షెడ్యూల్ విడుదల, ఆగస్టు 11న ఒకే రోజు రెండు షిఫ్టుల్లో పరీక్ష, వివాదాల కారణంగా వాయిదా పడుతూ వచ్చిన నీట్ యూజీ 

నీట్ లీకేజీ ఇష్యూ దర్యాప్తును కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి (CBI) అప్పగించామని, ఇప్పటికే ఈ కేసులో పలువురు నిందితులను సైతం అరెస్ట్ చేసినట్లు అఫిడవిట్‌లో కేంద్రం పేర్కొంది. నీట్ పరీక్షను రద్దు చేస్తే నిజాయితీగా పరీక్ష రాసిన వారు నష్టపోతారని తెలిపింది. పారదర్శకంగా పరీక్షల నిర్వహణకు కట్టుబడి ఉన్నామని ఈ సందర్భంగా సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.