ఉత్తరాదిలో వర్షాలు, వరదలు మరోసారి ముంచెత్తుతున్నాయి. వీటికి తోడు కొండచరియలు విరిగిపడటంతో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో 66 మంది మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. వారిని రక్షించడానికి, శిథిలాల నుంచి మృతదేహాలను బయటకు తీయడానికి సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. సిమ్లా, జోషిమఠ్ లో ఇళ్లు నేలకూలి అధిక ప్రాణనష్టం జరుగుతోంది. మంగళవారం కొండచరియలు విరిగిపడిన ఘటనలో శిథిలాల నుంచి మూడు మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది వెలికితీశారు.
సిమ్లాలో కూలిన శివాలయం శిథిలాల నుంచి ఒక మృతదేహాన్ని బయటకు తీశారు. నగరంలో కొండచరియలు విరిగిపడటంతో తాజాగా మరో ఇద్దరు మరణించారని అధికారులు తెలిపారు. ప్రతికూల వాతావరణం కారణంగా రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు విద్యాశాఖ ఈ రోజు సెలవు ప్రకటించింది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీతో పాటు పోలీసులు ఈ ఉదయం 6 గంటలకు సమ్మర్ హిల్ వద్ద రెస్క్యూ ఆపరేషన్‌లను తిరిగి ప్రారంభించాయని సిమ్లా డిప్యూటీ కమిషనర్ ఆదిత్య నేగి తెలిపారు.రాబోయే రెండు రోజుల్లో హిమాచల్ ప్రదేశ్‌లో, మరో నాలుగు రోజుల్లో ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
Here's Video
#WATCH | Several houses collapsed in Krishna Nagar area in Himachal Pradesh's Shimla after a landslide took place. Rescue operation underway.
(Video Source: Local; confirmed by Police and administration) pic.twitter.com/qdYvR4C4fx
— ANI (@ANI) August 15, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)