Varanasi, June 19: ప్రధాని నరేంద్రమోడీ (Narendra Modi) పర్యటనలో భద్రతా ఉల్లంఘన జరిగింది. ఇటీవల వారణాసిలో పర్యటించేందుకు ప్రధాని మోడీ (Modi in Varanasi) వెళ్లారు. ఈ సమయంలోనే భద్రతా వైఫల్యం జరిగింది. ప్రధాని బుల్లెట్ ప్రూఫ్ కాన్వాయ్ రద్దీగా ఉన్న ప్రాంతం నుంచి వెళ్తున్నప్పుడు కాన్వాయ్‌పైకి చెప్పులు (Slipper Thrown) విసిరారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
Slipper thrown at PM Modi’s bulletproof car in Varanasi. Isn’t this a massive security breach? pic.twitter.com/mO6tao7Vh5
— Vijaita Singh (@vijaita) June 19, 2024
అయితే, ఇందుకు బాధ్యులైన వారిని అరెస్ట్ చేశారా..? లేదా..? అనే విషయంపై స్పష్టత రాలేదు. ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేసినప్పటికీ (Slipper Thrown on Modi Car) ఈ ఘటన చోటు చేసుకుంది.
Security breach ! Slipper thrown at PM Modi’s bulletproof car in Varanasi has surfaced..#NarendraModi #Varanasi #SecurityBreach #PMModi pic.twitter.com/JAQnUqxZL3
— Madhuri Daksha (News Presenter) (@MadhuriDaksha) June 19, 2024
మంగళవారం రోజున ప్రధానిగా మూడోసారి ప్రమాణస్వీకారం చేసిన తర్వాత మోడీ వారణాసికి వెళ్లారు. ఈ సందర్భంగా కాశీ విశ్వనాథ ఆలయంలో గంగా హారతి కార్యక్రమానికి హాజరయ్యారు. గతంలో పంజాబ్‌లో కూడా ఇలాగే ప్రధాని మోడీ భద్రతలో వైఫల్యం ఎదురైంది. కొన్ని నిమిషాల పాటు ఓ ఫ్లై ఓవర్‌పై కాన్వాయ్ నిలిచిపోయింది.