New Delhi, May 12: సరికొత్త యాడ్‌తో ముందుకొచ్చిన ప్రముఖ కాఫీ బ్రాండ్ స్టార్‌బక్స్ (Starbucks) చిక్కుల్లో పడింది. వివాదాస్పద యాడ్‌తో బాయ్‌కాట్ స్టార్‌బక్స్ (Starbucks) ట్రెండ్ అవుతోంది. ట్రాన్స్‌జెండర్ల హక్కులపై ఫోకస్ చేస్తూ మే 10న స్టార్‌బక్స్ విడుదల చేసిన నూతన ప్రకటన వివాదాలకు కేంద్ర బిందువైంది ( Facing Backlash). ఇట్ స్టార్ట్స్ విత్ యువర్ నేమ్ అనే ట్యాగ్‌లైన్, హ్యాష్‌ట్యాగ్‌తో స్టార్‌బక్స్ ఇండియా చేపట్టిన క్యాంపెయిన్ బెడిసికొట్టింది.
ఇక ఈ ప్రకటన విషయానికి వస్తే రెండు నిమిషాల నాలుగు సెకండ్ల వ్యవధి కలిగిన ఈ క్లిప్‌లో స్టార్‌బక్స్ అవుట్ లెట్‌లో పేరెంట్స్ కూర్చుని తమ కొడుకు కోసం వేచిచూస్తుంటారు. తమ కుమారుడు స్త్రీగా మారడాన్ని తండ్రి అంగీకరించేందుకు ఇబ్బంది పడుతుండటం కనిపిస్తుంది. తన కొడుకు అర్పిత్ కాస్తా అర్పితగా మారడం ఆయన జీర్ణించుకోలేకపోతాడు. కొద్దిసేపటికి అర్పిత అక్కడకు చేరగానే కొద్దిగా ముభావంగా కనిపించిన తండ్రి ఆపై అందరికీ కాఫీ ఆర్డర్ చేయడం, అర్పిత చేయిని తడమంతో ఆమె స్వేచ్ఛను అంగీకరించినట్టు సంకేతాలు పంపుతాడు. స్టార్‌బక్స్‌లో మీరు అర్పిత్ లేదా అర్పిత మీ పేరేదైనా మిమ్మల్ని మీరుగా అంగీకరించి ప్రేమ కురిపిస్తాం అని స్టార్‌బక్స్ అధికారిక ట్విట్టర్ పేజ్‌లో ట్వీట్ చేశారు.
Your name defines who you are - whether it's Arpit or Arpita. At Starbucks, we love and accept you for who you are. Because being yourself means everything to us. #ItStartsWithYourName. 💚 pic.twitter.com/DKNGhKZ1Hg
— Starbucks India (@StarbucksIndia) May 10, 2023
స్టార్‌బక్స్ మార్కెటింగ్ క్యాంపెయిన్ 48 గంటల్లోనే వైరల్ అయింది. ఈ యాడ్‌కు 25 లక్షల ట్విట్ వ్యూస్, 5.3 లక్షల వీడియో వ్యూస్ లభించాయి. ట్రాన్స్‌జెండర్ హక్కులపై (Transgender Rights) ఫోకస్ చేసిన క్యాంపెయిన్‌పై సోషల్ మీడియాలో హాట్ డిబేట్ సాగింది. ఈ క్యాంపెయిన్ సరైనదని కొందరు సమర్ధించగా మరికొందరు ఇలాంటి విషయాలను సెన్సిటివ్‌గా డీల్ చేయాలని అసలు ముందు ఈ క్యాంపెయిన్ అవసరమా అని పలువురు యూజర్లు ప్రశ్నించారు. ఇక బాయ్‌కాట్ స్టార్‌బక్స్ హ్యాష్‌ట్యాగ్‌తో ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోంది. లింగమార్పిడిని ప్రోత్సహించేలా యాడ్ ఉందని కొందరు ట్వీట్లు పెడుతున్నారు. ఇలాంటి అంశాలను తమ యాడ్స్ కోసం వాడుకోవద్దంటూ హితవు చెప్తున్నారు.