Senthil Balaji Arrest (PIC" ANI Twitter)

Chennai, June 14:  తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీని (Senthil Balaji Arrest) అదుపులోకి తీసుకున్నారు ఎన్ ఫోర్స్ మెంట్ (ED) డైరక్టరేట్ అధికారులు. మనీలాండరింగ్ ఆరోపణలతో ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఆయన్ను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించిన సమయంలో ఉద్రిక్తతత నెలకొంది. ఆస్పత్రికిలోకి తీసుకెళ్తున్న సమయంలో మంత్రి సెంథిల్ బోరున (Senthil Balaji breaks down) విలపించారు. తనను అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో ఆయనకు ఛాతిలో నొప్పి వచ్చింది. దాంతో ఆయన్ను ఐసీయూకి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు సెంథిల్ అరెస్టును తీవ్రంగా ఖండించింది డీఎంకే (DMK). కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఆరోపించింది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా మోదీ సర్కారు వ్యవహరిస్తోందన్నారు డీఎంకే నేతలు.