Chennai December 24: రాజీవ్‌హత్య కేసు(Rajiv Gandhi assassination case)లో దోషి నళిని (Nalini Sriharan)కి నెల రోజులు పెరోల్ మంజూరైంది. నళిని తల్లి(Nalini Mother Padma) వేసిన పిటీషన్ మేరకు ఆమెకు నెలరోజుల పెరోల్(granted parole) మంజూరైంది. తనకు ఆరోగ్యం సరిగ్గా లేదని, ఈ సమయంలో తన కూతురితో ఉండాలని భావిస్తున్నట్లు నళిని తల్లి పద్మ చెన్నై హైకోర్టు(Chennai High court) ఆశ్రయించారు.
ఈ పిటీషన్‌పై న్యాయమూర్తులు వీఎన్ ప్రకాశ్, ఆర్. హేమలత బెంచ్ విచారణ జరిపింది. అటు నళినికి నెల రోజులు పెరోల్ ఇవ్వడానికి తమిళనాడు సర్కారు నిర్ణయించినట్టు ప్రభుత్వ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో నళినికి పెరోల్ మంజూరైంది.
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో యావజ్జీవ శిక్షను అనుభవిస్తున్న ఏడుగురిలో నళిని ఒకరు. వీరిని ముందస్తుగా విడుదల చేయాలని తమిళనాడు కేబినెట్ 2018లో గవర్నర్‌కు సిఫారసు చేసింది. కానీ రాజ్‌భవన్ నుంచి ఇంకా నిర్ణయం వెలువడలేదు. దాంతో గవర్నర్ అనుమతి లేకుండా తనను ముందస్తుగా విడుదల చేయాలని నళిని తదితరులు హైకోర్టులో పిటిషన్లు వేశారు. అవి ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో నళిని తరఫున తల్లి పద్మ హైకోర్టును ఆశ్రయించారు.