Image Used for Representational Purpose Only | (Photo Credits: ANI)

Chennai, Sep 25: తాగుడుకు డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో నానమ్మను మనవడు హత్య (Man kills grandmother) చేశాడు. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో ఈ దారుణ ఘటన జరిగింది. అక్కడి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పసువనపాలెం గ్రామానికి చెందిన సుశీల అంగన్‌వాడీ కార్యకర్తగా పని చేసి రిటైర్‌ అయ్యింది. ఆమె కుమారుడు రంగనాథన్ చెన్నైలోని వనగ్రామ్‌లో నివసిస్తున్నాడు. రంగనాథన్ కుమారుడు 30 ఏండ్ల జగన్‌ అప్పుడప్పుడు నానమ్మ ఇంటికి వస్తుండేవాడు.

ఈ క్రమంలో ఇటీవల నానమ్మ సుశీల ఇంటికి వచ్చిన మనవడు జగన్‌ బుధవారం రాత్రి మద్యం కొని తాగేందుకు డబ్బులు అడిగాడు. దీనికి ఆమె నిరాకరించడంతో (she refuses money for liquor) ఆగ్రహించిన జగన్‌ అట్ల పెనంతో నానమ్మ తలపై బలంగా కొట్టాడు. దీంతో ఆ వృద్ధురాలు చనిపోయింది. అనంతరం అక్కడి నుంచి పారిపోయిన జగన్‌ సమీప గ్రామంలోని తన స్నేహితుడి ఇంటికి వెళ్లాడు.

కాలేజీ హాస్టల్లో గొడవ, కోపంతో విద్యార్థిని భవనంపై నుంచి తోసేసిన తోటి విద్యార్థులు, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాధితుడు మృతి, ఆందోళన చేపట్టిన విద్యార్థులు, మృతుని తల్లిదండ్రులు

ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు వెళ్లి నిందితుడు జగన్‌ను అరెస్ట్‌ చేశారు. అతడ్ని ప్రశ్నించగా నానమ్మను తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.