Tamil Nadu Shocker: ప్రేమించలేదని కత్తితో 14 సార్లు కిరాతకంగా పొడిచాడు, గతంలోనే అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన యువతి, బెయిల్‌‌పై విడుదలై వచ్చి ఘాతుకానికి పాల్పడిన రాక్షసుడు

తమిళనాడులో రాష్ట్రంలో దారుణ ఘటన (Tamil Nadu Shocker) చోటు చేసుకుంది. ప్రేమను తిరస్కరించిందని ఓ యువకుడు 14 సార్లు యువతిని కత్తితో పొడిచి చంపేశాడు. దారుణ ఘటన వివరాల్లోకెళ్తే.. తిరుచ్చిలో 16 ఏళ్ల బాలిక పరీక్షలు అయిపోయాయని తన బంధువుల ఇంటికి ఆనందంగా వెళ్తోంది.

Tamil Nadu Shocker: ప్రేమించలేదని కత్తితో 14 సార్లు కిరాతకంగా పొడిచాడు, గతంలోనే అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన యువతి, బెయిల్‌‌పై విడుదలై వచ్చి ఘాతుకానికి పాల్పడిన రాక్షసుడు
Representative Image Murder ( Photo Credits : Pixabay

Chennai, June 1: తమిళనాడులో రాష్ట్రంలో దారుణ ఘటన (Tamil Nadu Shocker) చోటు చేసుకుంది. ప్రేమను తిరస్కరించిందని ఓ యువకుడు 14 సార్లు యువతిని కత్తితో పొడిచి చంపేశాడు. దారుణ ఘటన వివరాల్లోకెళ్తే.. తిరుచ్చిలో 16 ఏళ్ల బాలిక పరీక్షలు అయిపోయాయని తన బంధువుల ఇంటికి ఆనందంగా వెళ్తోంది. ఇంతలో కేశవన్‌ అనే వ్యక్తి వచ్చి ఆమె వెళ్తున్న దారిలో అడ్డగించి అడ్డుకుని తన ప్రేమను (spurning love proposal) అంగీకరించమంటూ వేధించాడు. ఆమె నిరాకరించడంతో కోపంగా కత్తితో 14 సార్లు కిరాతకంగా (man stabs Class 11 girl 14 times) పొడిచి పారిపోయాడు. స్థానికులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. కానీ ఆమె పరిస్థితి విషమంగా ఉంది.

ఐతే ఈ కేశవన్‌ పై ఆ బాలిక గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.అంతేకాదు పోలీసులు కేశవన్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఇటీవలే బెయిల్‌ పై విడుదలై వచ్చి మరీ ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. బాధితురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం ప్రారంభించారు. ఈ ఘటనపై కరూర్‌ కాంగ్రెస్‌ ఎంపీ జోతిమణి స్పందిచడమే కాకుండా నిందుతుడి పై కఠిన చర్యలు తీసుకోవల్సిందిగా జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ)ని కోరారు.

భార్య స్నేహితురాలిపై భర్త కన్ను, విషయం తెలిసి భర్త తలను నరికి నదిలో పడేసిన భార్య, ఆమె ఫ్రెండ్, ప‌శ్చిమ బెంగాల్‌లోని హుగ్లీలో దారుణ ఘటన

ఈ మేరకు పోలీసులు కేశవన్‌ కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు కూడా. అయితే కేశవన్‌ మణప్పరై సమీపంలో రైలు పట్టాలపై శవమై (accused found dead) కనిపించాడు. మృతదేహం వద్ద ఉన్న వస్తువులు, కేశవ తండ్రి ఇచ్చిన వాగ్మూలం ఆధారంగా చనిపోయిన వ్యక్తిని కేశవన్‌ పోలీసులు నిర్థారించారు.

(The above story first appeared on LatestLY on Jun 01, 2022 05:24 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).