boy fell into a borewell (Picture @ ANI Twitter)

Bhopal, DEC 07: మధ్యప్రదేశ్‌లోని బేతుల్ జిల్లాలో (Betul) విషాదం నెలకొంది. ఎనిమిదేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు బోరుబావిలో (fell into a borewell) పడిపోయాడు. దీంతో బాలుడ్ని క్షేమంగా తీసేందుకు పోలీసులు, రెవిన్యూ సిబ్బంది గత రాత్రి నుంచి తీవ్రంగా శ్రమిస్తున్నారు. బేతుల్ జిల్లా మాండవీలో (Mandvi) నానక్ చౌహాన్ అనే రైతు రెండేళ్ల క్రితం తన పొలంలో బోర్ వేశారు. అందులో నీళ్లు అడుగంటిపోవడంతో అది నిరుపయోగంగా ఉంది. బోరుబావిని (borewell) కప్పి ఉంచానని, అందులో ఎలా పడిపోయాడో తెలియడం లేదని పోలీసులకు చెప్పాడు. నిన్న సాయంత్రం ఐదు గంటల సమయంలో తన్మయ్ సాహు (Tanmay Sahu) అనే 8ఏళ్ల బాలుడు ఆడుకుంటూ వెళ్లి బోరుబావిలో పడిపోయినట్లు భావిస్తున్నారు.

బాలుడు దాదాపు 55 అడుగుల లోతులో ఉన్నట్లు రెస్క్యూ టీం (Rescue team) అంచనా వేస్తోంది. బాలుడికి ఆక్సిజన్ అందేలా ఏర్పాటు చేశామని తెలిపారు. అయితే లోపలి నుంచి బాలుడు స్పందించడం లేదని, సృహతప్పి ఉంటాడని చెప్తున్నారు. బాలుడ్ని రక్షించేందుకు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలతో పాటూ పోలీసులు, రెవిన్యూ సిబ్బంది సమన్వయంతో పనిచేస్తున్నారు. బోరుబావికి సమాంతరంగా గొయ్యి తీసి బాలుడిని బయటకు తీసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Tamil Nadu Rains: తమిళనాడుపై విరుచుకుపడనున్న తుపాను, 13 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేసిన ఐఎండీ, డిసెంబర్ 8న తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు 

ఈ ఘటనపై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ (Shivraj singh chouhan) స్పందించారు. ఘటనస్థలంలో ఉన్న అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. సహాయచర్యలపై ఆరా తీస్తున్నారు.